Video: రోడ్డును దొంగిలించిన ప్రజలు..! వినేందుకు వింతగా ఉన్న ఇది నిజం..

బీహార్‌లోని ఒక గ్రామంలో కొత్తగా నిర్మించిన తారు రోడ్డు నుండి గ్రామస్తులు తారును దొంగిలించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో గ్రామస్తులు బకెట్లలో తారును నింపుకొని తీసుకెళ్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ సంఘటన దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలకు దారితీసింది.

Video: రోడ్డును దొంగిలించిన ప్రజలు..! వినేందుకు వింతగా ఉన్న ఇది నిజం..
Viral Video

Updated on: Sep 03, 2025 | 6:20 AM

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసి నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి. గ్రామానికి రోడ్డు ఉంటే గ్రామస్తులు సంతోషంగా ఉంటారు. కానీ ఈ గ్రామ ప్రజలు తారు రోడ్డు నుండి తారును తీసి బకెట్లతో నింపి ఎత్తుకెళ్లిపోయారు. ఒక రకంగా చెప్పాలంటే రోడ్డును దొంగిలించేశారు. ఈ సంఘటన బీహార్‌లో జరిగింది.

ఈ వీడియోను @thatinadicmonk అనే ఖాతాలో షేర్ అయింది. “కొత్త రోడ్డు, దయనీయ పరిస్థితి. కొంతమంది తమ స్వార్థ ప్రయోజనాల కోసం దీన్ని దొంగిలించారు.” “రిజర్వేషన్‌ను ప్రాథమిక విధానంగా విశ్వసించే, తరం నుండి తరానికి ఉచిత రవాణాను ప్రోత్సహించే దేశం ఎల్లప్పుడూ అలాంటి వారిని ఉత్పత్తి చేస్తుంది” అని క్యాప్షన్లో పేర్కొన్నారు. ఈ వీడియోలో కొత్తగా వేసిన రోడ్డు తారు నుంచి కొంతమంది తారును తీసుకెళ్లారు. ఆగస్టు 31న షేర్ చేయబడిన ఈ వీడియోకు మూడు వేలకు పైగా వీక్షణలు వచ్చాయి.

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి