Viral Photo: ప్రకృతి అందాలను వర్ణించడానికి అక్షరాలు చాలవు. ఏ తీరున పోల్చినా ఇంకా ఏదో మిస్ అయినట్లుగానే ఉంటుంది. అంతటి రమణీయత, సౌందర్యం ప్రకృతి సొంతం. ఆస్వాదించాలే కానీ, ప్రకృతిలో ప్రతీది కనులవిందు చేస్తుంది. గడ్చిపోచలు, చిన్న చిన్న కీటకాల నుంచి పెద్ద పెద్ద జంతువులు సైతం ఎంతో అందగా కనిపిస్తుంటాయి. తాజాగా ఓ సీతాకోక చిలుకకు సంబంధించిన అందమైన ఫోటో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. మనం చాలాసార్లు చూసే ఉంటాం.. రంగు రంగుల సీతాకోక చిలుకలను. విభిన్న రంగులతో, డిజైన్‌తో చూడముచ్చటగా ఉంటాయి. తాజాగా ఓ సీతాకోక చిలుక తన అందంతో సోషల్ మీడియాను ఊపేస్తుంది. ఎంత అందంగా ఉందంటే.. ఒకసారి చూస్తే మళ్లీ మళ్లీ చూసేంతలా ఆకట్టుకుంటోంది. ప్రకృతి అందాల పోటీ పెడితే.. ఆ పోటీల్లో పాల్గొనేందుకు అందంగా ముస్తాబయి వచ్చిందా? అన్నట్లుగా ఆ సీతాకోక చిలుక ఉంది.
@Shyamli_Kashyap ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన ఈ ఫోటోలో సీతాకోక చిలుక పూర్తి తెలుపు రంగులో ఉంది. ఓ మెక్కపై వాలిన బటర్‌ఫ్లై.. తన రెక్కలను ముడుచుకుంది. తెల్లటి రెక్కలపై దిష్టి చుక్కలు పెట్టినట్లుగా నలుపు, ఎరుపు చుక్కలు అక్కడక్కడ ఉన్నాయి. చుక్కల చీర కట్టుకున్నట్లుగా కనిపిస్తున్న ఈ సీతాకోక చిలుక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఫోటో చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ప్రకృతి అందాలను మించిన అందం మరోటి లేదంటూ కామెంట్స్ పెడుతున్నారు. దాని అందానికి పరవశించిపోతున్నారు. మరెందుకు ఆలస్యం.. ఈ అందమైన ఫోటోను మీరూ చూసేయండి.
•~Crimson Speckled Moth….!!#MacroMonday #ThePhotoHour #Moth#MacroHour #StormHour #butterfly #waytowild #NaturePhotography #nature pic.twitter.com/9qlKNbFSvw
— Shyamli (@Shyamli_Kashyap) September 19, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..