Funny Video: అందుకే బ్యాక్ బెంచర్ ముందు కూర్చోకూడదు.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న వైరల్ వీడియో

|

Feb 14, 2022 | 1:34 PM

Childhood Viral Video: సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటాయి. ఈ వీడియోలు కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. దీంతోపాటు కొన్ని షాకింగ్, అల్లరి వీడియోలు

Funny Video: అందుకే బ్యాక్ బెంచర్ ముందు కూర్చోకూడదు.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న వైరల్ వీడియో
Viral Video
Follow us on

Childhood Viral Video: సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటాయి. ఈ వీడియోలు కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. దీంతోపాటు కొన్ని షాకింగ్, అల్లరి వీడియోలు కూడా వెలుగులోకి వస్తుంటాయి. అలాంటి వీడియోలు చూసిం మనం నవ్వుకోవడంతోపాటే.. చిన్ననాటి రోజులను కూడా నెమరువేసుకుంటుంటాం.. ఈ రోజుల్లో ఇలాంటి వీడియో ఇంటర్నెట్ (social media) ప్రపంచంలో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసే వారికి క్లాస్‌రూమ్‌లో అల్లరి చేసిన విషయాలు.. బాల్యం నాటి జ్ఞాపకాలు (childhood) గుర్తుకువస్తాయి. సాధారణంగా బొద్దింక, ఎలుకల వంటి చిన్న ప్రాణులను చూస్తే అందరూ భయపడతారు. ఎలుకలంటే సహజంగా భయమే.. ఎందుకంటే ఇది చాలా చిన్నగా ఉంటుంది. అంతేకాకుండా కొరుకుతుంది. అందుకే ముఖ్యంగా పిల్లలు, మహిళలు ఎలుకలను చూస్తే.. ఎగిరి గెంతేస్తారు. కొన్నిసార్లు ఎదుటివారిని ఆటపట్టించేందుకు కూడా ఎలుకలను ఉపయోగిస్తాం.. తాజాగా అలాంటి ఒక వీడియో వైరల్‌ (viral video) గా మారింది. ఒక బ్యాక్‌బెంచర్ క్లాస్‌లో ముందు కూర్చొని ఎలుకతో అందరినీ భయపెడతాడు.

వైరల్ అయిన ఈ క్లిప్‌ను చూస్తుంటే.. క్లాస్‌ రూంలో టీచర్ బ్యాక్‌బెంచర్‌ను ముందు సీట్లో కూర్చొబెట్టినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అతను ప్రతీకారం తీర్చుకోవడం కనిపిస్తుంది. తరగతి గదిలో ఓ విద్యార్థి బ్యాగ్‌లోంచి ఏదో బయటకు తీస్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. కొద్దిసేపటి తర్వాత.. ఒక ఎలుక అతని బ్యాగ్ నుంచి పరిగెత్తడం కనిపిస్తుంది. ఆ తర్వాత తరగతిలోని పిల్లలు భయంతో కేకలు వేయడం ప్రారంభించారు.

వైరల్ వీడియో.. 

ఈ ఫన్నీ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. చాలామంది వ్యక్తులు ఈ వీడియోను షేర్ చేస్తూ.. వారి స్నేహితులను ట్యాగ్ చేస్తున్నారు. ఒక వినియోగదారు ఈ వీడియోపై కామెంట్ చేస్తూ.. ఎలుకల జోలికి పోలేదు కానీ.. బొద్దింకను క్లాస్‌లో వదిలివేశానంటూ పేర్కొన్నాడు. దీంతోపాటు చాలామంది.. చిన్ననాటి మధురానుభూతులు గుర్తుకువస్తున్నాయంటూ కామెంట్లు చేస్తున్నారు.

Also Read:

Viral Video: తగ్గేదేలే.! వేటాడబోయిన మొసలి.. దిమ్మతిరిగే షాకిచ్చిన సింహం..

Viral Video: ఏనుగుల భీకర పోరాటం.. భయంకరమైన పోరులో ఏది గెలిచిందో చూడండి.. వీడియో వైరల్..