Elephant Funny Video: ఇంట్లో తిరిగే చిన్నపిల్లల ఆటలు ఎంతో ముద్దనిపిస్తాయి…అలాగే జంతువుల్లో కూడా చిన్నవయసులో ఉన్నవి చేసే చిలిపి చేష్టలు కూడా అంతే ఆకర్షిస్తుంటాయి. అవి చేసే చిలిపి పనులు మనకు ఎంతో ఉల్లాసాన్ని కలిగిస్తుంటాయి. ఇంట్లో వారితో సమానంగా అవి మనతో కలిసిపోయి జీవిస్తుంటాయి. మనతో మాట్లాడాలని, ఎదో చెప్పాలని, మన ఆహారం లాక్కునేందుకు పోటీ పడుతుంటాయి. అలాంటిదే ఇక్కడ మీరు చూస్తున్న ఈ గున్న ఏనుగు సరదా ఆటలు..
చూస్తున్నారుగా, గున్న ఏనుగు ఆ యువకుడ్ని ఎలా ఆటపట్టిస్తుందో…అతన్ని ప్రేమగా నుమురుతోంది. కితకితలు పెడుతోంది. తన బుజ్జి తొండంతో అతడి మెడను చుట్టేసుకుంటోంది. అతని చెవిలో ఏదో చెబుతున్నట్లుగా చేస్తోంది. ఏనుగు చేస్తున్న చిలిపి పనులకు ఆ యువకుడు తెగ సంబరపడిపోతున్నాడు. కిందపడి నవ్వుకుంటున్నాడు. ఈ ఇద్దరు చుట్టూ మర్చిపోయి సంతోషంగా ఆడుకుంటున్నారు.
ఈ ముద్దొచ్చే వీడియో సోషల్ మీడియాలో తెగ నవ్వులు పూయిస్తోంది. గున్న ఏనుగు అల్లరి చూసిన నెటిజన్లు..ఫిదా అవుతున్నారు. దాని ప్రేమకు లక్షల్లో వ్యూస్, లైకులు, షేర్లు పెరుగుతున్నాయి. నిజంగానే ఇలాంటి వీడియోలు మనసుకు మరింత ఉత్సహాన్నిఇస్తాయంటూ కామెంట్ చేస్తున్నారు. మళ్లీ మళ్లీ వీడియో చూస్తూ…తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
Aw they are so friendly pic.twitter.com/SEiU3teRIF
— ❤️A page to make you smile again ❤️ (@HopkinsBRFC) May 11, 2021
కాంట్రాక్ట్ ఉద్యోగులకు జగన్ సర్కార్ తీపికబురు.. పదవీ కాలం పొడిగింపు..
వాట్సాప్లో సీక్రెట్ చాట్ దాచుకోండిలా.. సరికొత్త సర్వీస్ అందుబాటులోకి.. వివరాలు ఇవే.!
అద్భుతమైన స్కీం.. ప్రతీ నెలా రూ. 1500 జమ చేయండి.. రూ. 53 లక్షలు పొందండి.. వివరాలివే.!
డేంజరస్ స్టంట్స్ చేసిన కోతి.. పులులకు గట్టి షాక్.. నవ్వులు పూయిస్తున్న వీడియో.!