స్వదేశీ జుగాడ్‌ అద్భుత సృష్టి.. ఈ ప్రతిభ భారతదేశం నుంచి బయటకు వెళ్లకూడదదంటున్న నెటిజన్లు..ఎంటబ్బా అది..?

|

Jul 10, 2023 | 7:18 PM

వీడియోలో ఓ వ్యక్తి పాత సైకిల్ చైన్-పెడల్, స్విచ్ సహాయంతో అద్భుతమైన పనిని చేశాడు. వీడియో చూసిన నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ఈ వీడియో సృష్టికర్త జుగాడ్‌ దేశం నుండి బయటకు వెళ్లకూడదంటూ ట్విట్‌ చేశారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఉపేంద్ర వర్మ పోస్ట్ చేసారు.

స్వదేశీ జుగాడ్‌ అద్భుత సృష్టి.. ఈ ప్రతిభ భారతదేశం నుంచి బయటకు వెళ్లకూడదదంటున్న నెటిజన్లు..ఎంటబ్బా అది..?
Automatic Handpump
Follow us on

దేశీ జుగాడ్‌ వీడియోలు ఇంటర్నెట్‌లో విస్తృతంగా కనిపిస్తుంటాయి.. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే వీటిలో కొన్ని ఉపాయాలు ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అలాంటి టెక్నిక్‌ని ప్రజలు ఉపయోగించకుండా ఉండలేరు. అలాంటిదే ఈ ఆటోమేటిక్ హ్యాండ్‌పంప్‌ తయారీ. ఈ వీడియో సోషల్ మీడియా పబ్లిక్‌ని ఎంతగానో ఆకట్టుకుంటోంది. వీడియోలో ఓ వ్యక్తి పాత సైకిల్ చైన్-పెడల్, స్విచ్ సహాయంతో అద్భుతమైన పనిని చేశాడు. వీడియో చూసిన నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ఈ వీడియో సృష్టికర్త జుగాడ్‌ భారత దేశం నుండి బయటకు వెళ్లకూడదంటూ ట్విట్‌ చేశారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఉపేంద్ర వర్మ పోస్ట్ చేసారు. దీనికి ఇప్పటివరకు 24 లక్షలకు పైగా వ్యూస్‌,1 లక్షా 16 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి.

ఈ ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లో ఒక వ్యక్తి జుగాడ్ టెక్నిక్ ఉపయోగించి ‘దేశీ హ్యాండ్‌పంప్’ని ఆటోమేటిక్ హ్యాండ్‌పంప్‌గా మార్చేశాడు. ఇందుకోసం సైకిల్ చైన్, హ్యాండ్ పంప్, ఎలక్ట్రిక్ స్విచ్, కొన్ని వైర్లను ఉపయోగించాడు. వైరల్ క్లిప్‌ను పరిశీలిస్తే..విద్యుత్ స్విచ్‌కు వైర్‌ను కనెక్ట్ చేసి, సైకిల్ చైన్-పెడల్‌కు, పైపు సహాయంతో హ్యాండ్ పంప్‌కు కనెక్ట్ చేసి మోటారును అమర్చినట్లు తెలుస్తుంది. ఇక స్విచ్ వేసిన వెంటనే చేతి పంపు దానికదే పనిచేయడం ప్రారంభమవుతుంది. చేతి పంపు నుంచి నీరు పైకి రావడం ప్రారంభమవుతుంది.

ఇవి కూడా చదవండి

అంతే, ఇంత ఈజీగా పనిచేస్తున్న దేశీ జుగాడ్‌ చేతి పంపు నెటిజన్లకు ఎంతగానో నచ్చుతుంది. వీడియో చూసిన నెటిజన్లు తమ స్టైల్లో స్పందించారు. ఇలాంటి దేశీ పద్ధతిని మీరు ఎప్పుడైనా చూసారా..? ఈ జుగాద్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..