Amazing video: డ్రైవింగ్ అవార్డు ఇస్తేగిస్తే మనోడికే ఇవ్వాలి.. ఆ నడపడం చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే

|

Aug 12, 2021 | 6:09 PM

ప్రమాదాలు చెప్పి రావు.. కొన్ని సార్లు మాత్రమే అదృష్టం.. మ్యాజిక్ రెండూ కలిసి వస్తే పెద్ద ప్రమాదాలు తృటిలో తప్పిపోతుంటాయి. అందుకే రోడ్డుపై డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా...

Amazing video: డ్రైవింగ్ అవార్డు ఇస్తేగిస్తే మనోడికే ఇవ్వాలి.. ఆ నడపడం చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే
Amazing Video
Follow us on

ప్రమాదాలు చెప్పి రావు.. కొన్ని సార్లు మాత్రమే అదృష్టం.. మ్యాజిక్ రెండూ కలిసి వస్తే పెద్ద ప్రమాదాలు తృటిలో తప్పిపోతుంటాయి. అందుకే రోడ్డుపై డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా మనసు పెట్టినడపాలి. ట్రాఫిక్ నిబంధనలు ఎన్ని పెట్టిన మనసు అదుపులో లేకపోవడంతో చాలా మంది ప్రమాదాలను కొని తెచ్చుకుంటారు. అలాంటి ఒక ఆటో డ్రైవర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. అతని అద్భుతమైన డ్రైవింగ్ చూసి ఫిదా అవుతున్నారు.  డ్రైవింగ్‌లో అతను చేసే కట్టింగ్స్ చూసి నెటిజన్లు పిచ్చివాళ్లు అవుతున్నారు. రోడ్డుపై ఆ ఆటో డ్రైవర్ చేసిన విన్యాసాలను చూసి ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఈ వీడియో చూస్తే మీరు కూడా షాక్ తింటారు.  ఈ డ్రైవర్ నైపుణ్యాన్ని చూస్తే రోడ్డుపై ఇలా కూడా నడపవచ్చా అనుకుంటారు.

వీడియోలో మీరు ఒక ఆటో డ్రైవర్ ముందు నుండి రోడ్డు మీద డ్రైవ్ చేస్తున్నట్లు చూడవచ్చు. హఠాత్తుగా కారు ముందుకు దూసుకు వస్తుంది. ఆటో కారును ఢీ కొట్టాలి కాని అలా జరగలేదు. ఆటో డ్రైవర్ తన ఆటోను చాలా జాగ్రత్తగా కట్ చేశాడు. తద్వారా ఆటో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుంది. కారును తాకుండానే ఆటో ముందుకు వెళ్లిపోతున్నది మీరు ఈ వీడియోలో చూడవచ్చు. పెద్ద ప్రమాదాన్ని నివారించడానికి డ్రైవర్ కట్ చేసిన అద్భుతం చూసి యూజర్లు ఆటో డ్రైవర్ టెక్నిక్‌కు ఫిదా అవుతున్నారు. ఇలాంటి డ్రైవర్లు మనకు గ్రామాల్లో అక్కడక్కడ కనిపిస్తారు.

ఈ వీడియోలో స్టంట్ డ్రైవర్ ఎవరో తెలియదు. కానీ అతని ఆటో డ్రైవింగ్ నైపుణ్యానికి నెటిజన్లు పిచ్చివాళ్లుగా మారుతున్నారు. అతనికి ఈ అద్భుతమైన శిక్షణ ఎక్కడ నుండి వచ్చిందని ప్రజలు అడుగుతున్నారు. ఈ వీడియో Instagram gaddiyan wale అకౌంట్‌తో షేర్ చేయబడింది. మీరు నాసా నుండి డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు అంటే నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. నాసా నుంచి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నవారు మాత్రమే ఇలా డ్రైవిగ్ చేస్తారు అంటూ సెటైర్లను పేల్చుతున్నారు.

ఇవి కూడా చదవండి: రిస్క్ తక్కువ.. లాభాలు ఎక్కువ.. మార్కెట్‌లో కొత్తవారికి ఇండెక్స్ ఫండ్స్‌తో మంచి రాబడి..

Puri Jagannath Temple: ఇవాళ తెరుచుకున్న పూరీ జగన్నాథుడి ఆలయం.. భక్తులకు అనుమతి ఎప్పటి నుంచి అంటే..?