Viral News: మరో మహిళతో సంబంధం పెట్టుకున్న భర్త.. ఏకంగా పేపర్‌లో యాడ్‌ ఇచ్చి తిక్క కుదిర్చిన భార్య..

Viral News: భార్య, భర్తలన్నాక గొడవలు జరగడం సర్వసాధారణమైన విషయమే. అయితే ఈ గొడవలు కొంత మేర ఉంటే చూసే వారికి కూడా బాగానే కనిపిస్తాయి. అలా కాదని హద్దులు మీరితే కుటుంబాలు కుప్పకూలిపోయే...

Viral News: మరో మహిళతో సంబంధం పెట్టుకున్న భర్త.. ఏకంగా పేపర్‌లో యాడ్‌ ఇచ్చి తిక్క కుదిర్చిన భార్య..

Updated on: Aug 14, 2022 | 3:20 PM

Viral News: భార్య, భర్తలన్నాక గొడవలు జరగడం సర్వసాధారణమైన విషయమే. అయితే ఈ గొడవలు కొంత మేర ఉంటే చూసే వారికి కూడా బాగానే కనిపిస్తాయి. అలా కాదని హద్దులు మీరితే కుటుంబాలు కుప్పకూలిపోయే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా భార్య భర్తల మధ్య మరో వ్యక్తి రావడం సంసార జీవితాలను అల్లకల్లోలం చేస్తుంటాయి. ఇలాంటి సంఘటనలు జరిగిన వాటిలో చాలా వరకు భార్యలే బాధితులువుతుంటారు. అయితే చాలా మంది భార్యలు సర్దుకుపోవడమో లేదా విడాకులు తీసుకొని వారికి దూరంగా ఉండడమో చేస్తుంటారు. అయితే ఓ మహిళ మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరించింది. కట్టుకున్న భర్త మరో భార్యతో ఉంటున్నాడని తెలిసి, బుద్ధి వచ్చేలా చేసింది. ఇంతకీ ఆ భార్య చేసిన పనేంటనేగా మీ సందేహం. అయితే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

ఆస్ట్రేలియాలకు చెందిన జెన్నీ, స్టీవ్‌ భార్యాభర్తలు. వీరిద్దరి కాపురం సంతోషంగా సాగుతోన్న సమయంలో స్టీవ్‌ జీవితంలోకి మరో అమ్మాయి వచ్చింది. స్టీవ్‌ గత కొన్ని రోజులుగా మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని జెన్నీ అతనికి ఎలాగైనా తగిన బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది. అనుకున్నదే తడవుగా ఆస్ట్రేలియాలోని ప్రముఖ వారపత్రిక ‘మాకే అండ్‌ విట్ సండే లైఫ్‌’లో ఒక ప్రకటన ఇచ్చింది.

ఇవి కూడా చదవండి

ఈ ప్రకటనలో.. ‘డియర్‌ స్టీవ్‌ నువ్వు ఇప్పుడు ఆమెతో చాలా సంతోషంగా ఉన్నావని అనుకుంటున్నాను. నువ్వు ఎంత నీచమైన మోసగాడివో అందరికి తెలిసిపోతుంది’ అంటూ పేర్కొంది. అంతటితో ఆగకుండా చివరిలో ఈ ప్రకటన వేయడానికి అయిన ఖర్చును నీ క్రెడిట్ కార్డుతోనే చెల్లించాను అని మరో షాక్‌ ఇచ్చింది. దీంతో ఈ అంశం ఆస్ట్రేలియాలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ప్రకటనపై సదరువార్త పత్రిక స్పందిస్తూ.. ఈ ప్రకటన కోసం డబ్బులను క్రెడిట్ కార్డుతో చెల్లించలేదని తెలిపింది.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..