Video: గోమాతను రక్షించిన ఆస్ట్రేలియన్‌ కుర్రాడు! చేతికి గాయమైనా..

మన దేశంలో పర్యటిస్తున్న ఓ ఆస్ట్రేలియన్ యువకుడు కాలువలో చిక్కుకున్న ఆవును సాహసోపేతంగా రక్షించాడు. ఇండియాలో ఆవును గోమాతగా కొలిచే మనం కొన్నిసార్లు పట్టించుకోని పరిస్థితుల్లో, ఆ విదేశీయుడు తన ప్రాణాలను పణంగా పెట్టి మూగజీవిని కాపాడాడు. అతని ఈ మానవత్వపు చర్య సోషల్ మీడియాలో వైరల్ అయ్యి, ఎంతో ప్రశంసలు పొందుతోంది.

Video: గోమాతను రక్షించిన ఆస్ట్రేలియన్‌ కుర్రాడు! చేతికి గాయమైనా..
Australian Tourist Rescues

Updated on: Sep 27, 2025 | 12:24 PM

మన దేశంలో ఆవును చాలా మంది గోమాతగా కొలుస్తారు. కానీ కొన్నిసార్లు అవి ప్రమాదంలో ఉన్నా పట్టించుకోకుండా వెళ్లిపోతారు. కానీ, మన దేశం కాదు, మన మతం కాదు.. కానీ గోమాతను ప్రమాదం నుంచి రక్షించాడు ఓ ఆస్ట్రేలియన్‌ కుర్రాడు. మన దేశంలో పర్యటిస్తున్న ఆస్ట్రేలియన్‌ టూరిస్ట్‌ ఎంత రిస్క్‌ తీసుకొని ఆవును రక్షించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోను స్వయంగా ఆ టూరిస్ట్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు.

ఇండియాలో పర్యటిస్తున్న క్రమంలో అతనికి దూరం నుంచి ఓ దృశ్యం కనిపించింది. ఓ చిన్న కాలువలో పాపం ఆవు పడి ఉంది. వెనుక భాగం కాలువలో ఇరుక్కుపోయింది. దాంతో ఆ ఆవు అందులోంచి రాలేక నరకయాతన పడుతోంది. ఇది చూసిన టూరిస్ట్‌ వెంటనే స్పందించి.. దాన్ని మరో వ్యక్తి సాయంతో దాన్ని రక్షించాడు. ఆవును బయటికి తీస్తున్న సమయంలో అతని వేలికి గాయమైంది. దాన్ని పట్టించుకోకుండా ఓ మూగ జీవాన్ని రక్షించాననే సంతోషంతో కనిపించాడు. అతను చేసిన పనికి సోషల్‌ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి