Viral Video: భూమిని చదును చేస్తుండగా దొరికిన పురాతన కూజా.. ఓపెన్ చేయగా మెరుస్తూ.!

|

Apr 19, 2024 | 1:30 PM

చారిత్రిక ఆనవాళ్లను, దేశ చరిత్రకు అడ్డం పట్టేలా వస్తువులను అనేకం పురావస్తు అధికారులు తమ తవ్వకాల్లో బయటకు తీస్తుండటం సర్వసాధారణం. అయితే కొందరు అత్యాసకు పోయి.. గుప్తనిధుల కోసం పురాతన దేవాలయాల్లో, వాటి సమీప ప్రాంతాల్లో తవ్వకాలు చేస్తుంటారు.

Viral Video: భూమిని చదును చేస్తుండగా దొరికిన పురాతన కూజా.. ఓపెన్ చేయగా మెరుస్తూ.!
Viral Photo
Follow us on

చారిత్రిక ఆనవాళ్లను, దేశ చరిత్రకు అడ్డం పట్టేలా వస్తువులను అనేకం పురావస్తు అధికారులు తమ తవ్వకాల్లో బయటకు తీస్తుండటం సర్వసాధారణం. అయితే కొందరు అత్యాసకు పోయి.. గుప్తనిధుల కోసం పురాతన దేవాలయాల్లో, వాటి సమీప ప్రాంతాల్లో తవ్వకాలు చేస్తుంటారు. వారి గుప్తనిధులు దొరకడం అటుంచితే.. చివరికి పోలీసులకు దొరికిపోయి జైలుకు వెళ్తుంటారు. సరే.! ఇవన్నీ పక్కనపెడితే.. ఇటీవల సోషల్ మీడియాలో పురావస్తు తవ్వకాలకు సంబంధించిన వీడియోలు ఎన్నో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ కోవకు చెందిన ఓ వైరల్ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. వైరల్ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి చారిత్రిక ఆనవాళ్లను తవ్వే క్రమంలో.. ఒక చోట తవ్వకాలు జరుపుతున్నాడు. ఇక అక్కడి భూమిని చదును చేస్తుండగా.. ఓ పురాతన కూజా బయటపడింది. దాని చుట్టూ మట్టి ఎక్కువగా ఉండటంతో.. అది బయటకు రావట్లేదు. దీంతో ఆ కూజాను మధ్యలో రెండుగా పగలగొట్టగా.. గాజులు, ఆభరణాలు లాంటివి దొరికాయి. ఈ వీడియో ఇంటర్నెట్‌లో తెగ సర్కులేట్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరూ వీడియోపై ఓ లుక్కేయండి.