
పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తూర్పు హిమాలయాలలో కనిపించే అరుదైన, అందమైన మొక్క సిక్కిం సుందరిని ప్రపంచానికి పరిచయం చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో ఆయన షేర్ చేసిన పోస్ట్ ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించింది. శాస్త్రీయంగా రూమ్ నోబైల్ అని పిలువబడే సిక్కిం సుందరి సముద్ర మట్టానికి సుమారు 4,000 నుండి 4,800 మీటర్ల ఎత్తులో పెరుగుతుంది. ఇక్కడ మనుగడ అనేక సవాళ్లతో కూడుకుని ఉంటుంది.
గ్లాస్‌హౌస్ ప్లాంట్‌ను గుర్తించడం ఎలా ?:
స్థానికంగా చుకా అని పిలువబడే ఈ మొక్క దాని పారదర్శకమైన, పొడవైన ఆకుల కారణంగా దీనిని “గ్లాస్‌హౌస్ ప్లాంట్” అని పిలుస్తారు. ఈ ఆకులు సూర్యరశ్మిని బంధిస్తాయి. కానీ, హానికరమైన అతినీలలోహిత కిరణాలను నిరోధిస్తాయి. అందుకే ఈ మొక్క కఠినమైన హిమాలయ వాతావరణంలో మనుగడ సాగిస్తుంది. దూరం నుండి పర్వతాలకు వ్యతిరేకంగా మెరుస్తున్నట్లు కనిపిస్తుంది.
‘దశాబ్దాల నిరీక్షణ’:
ఆనంద్ మహీంద్రా ఈ మొక్క జీవిత చక్రాన్ని బట్టి సహనంలో మాస్టర్ క్లాస్‌గా అభివర్ణించారు. ఆ మొక్క సంవత్సరాలు, కొన్నిసార్లు దశాబ్దాలుగా కేవలం ఒక చిన్న ఆకుల సమూహంగా జీవిస్తుందని చెప్పారు. అది ఒక్క రోజులో అకస్మాత్తుగా దాదాపు రెండు మీటర్ల ఎత్తుకు పెరుగుతుంది. విత్తనాలను విడుదల చేస్తుంది. అలా దాని జీవితాన్ని పూర్తి చేస్తుంది. ఈ ప్రక్రియను సైన్స్‌లో మోనోకార్పీ అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి అద్భుత, అపూర్వమైన వృక్షజాలన్ని ఎందుకు పాఠ్యాంశాల్లో ప్రస్తావించలేదని ప్రశ్నించారు.
ఔషధ లక్షణాలు, సాంస్కృతిక ప్రాముఖ్యత:
నిపుణుల ప్రకారం.. జీర్ణక్రియ, వాపు, కాలేయం, నొప్పి సంబంధిత సమస్యలకు ఈ మొక్క ఔషధపరంగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. కాగా, మరికొంతమంది నెటిజన్లు దీన్ని ఉత్తరాఖండ్‌లో కనిపించే బ్రహ్మ కమలం చెట్టుతో పోల్చారు.
వీడియో ఇక్కడ చూడండి…
I knew nothing about this extraordinary marvel: the ‘Sikkim Sundari’
Thriving at staggering altitudes of 4,000–4,800 meters, this “Glasshouse Plant” stands like a glowing tower against the mountains.
Its life is a masterclass in patience.
It is monocarpic, which means that… pic.twitter.com/keoMSmGcUl
— anand mahindra (@anandmahindra) December 21, 2025
హిమాలయాల అందాలకు సజీవ ఉదాహరణ
వృక్షశాస్త్రజ్ఞుల అభిప్రాయం ప్రకారం, ఈ మొక్క గోధుమ-బంగారు అపారదర్శక ఆకులు, గులాబీ అంచులు పర్వతాల మధ్య మెరిసే దీపస్తంభం లాంటిదని వర్ణించారు. ఇకపోతే, స్థానికులు దీని కాండాలను ఆహారంగా తింటారు. దీని వేర్లను సాంప్రదాయ వైద్యంలో ఉపయోగిస్తారు. సిక్కిం అందం ప్రకృతి అద్భుతం మాత్రమే కాదు, భారతదేశ జీవవైవిధ్యానికి ఒక విలువైన చిహ్నం కూడా.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..