400 మార్కులకు 397.5.. ఏఐ గ్లాసులతో పరీక్షలో హైటెక్ మోసం.. టాపర్ బండారం బయటపడింది!

సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో, దానిని అక్రమ మార్గాల్లో వాడుకునే వారి సంఖ్య కూడా అంతే వేగంగా పెరుగుతోంది. తాజాగా సౌత్ కొరియాలో జరిగిన ఒక సంఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అత్యంత కఠినమైన పరీక్షగా పేరున్న ట్యాక్స్ అకౌంటెన్సీ ఎగ్జామ్‌లో ఒక అభ్యర్థి కృత్రిమ మేధస్సు (AI) సాయంతో చీటింగ్ చేసి ఏకంగా టాపర్‌గా నిలిచాడు. అయితే, అతడి అతిభైరవ ప్రవర్తన కారణంగా అసలు నిజం బయటపడి కటకటాలపాలయ్యాడు.

400 మార్కులకు 397.5.. ఏఐ గ్లాసులతో పరీక్షలో హైటెక్ మోసం.. టాపర్ బండారం బయటపడింది!
Ai Glasses Cheating

Updated on: Nov 16, 2026 | 10:41 AM

సౌత్ కొరియాలో జరిగిన అత్యంత కఠినమైన ట్యాక్స్ అకౌంటెన్సీ పరీక్షలో సియోక్ (34) అనే వ్యక్తి కృత్రిమ మేధస్సు (AI) సాంకేతికతను ఉపయోగించి అక్రమాలకు పాల్పడ్డాడు. ఏఐ గ్లాసెస్, మొబైల్ ఫోన్ సహాయంతో ప్రశ్నలకు సమాధానాలు రాబట్టి ఏకంగా 400 మార్తులకు గాను 397.5 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచాడు. అయితే, పరీక్షలో అతడు సాధించిన అసాధారణ మార్కలపై తోటి అభ్యర్థులకు అనుమానం వచ్చి నిలదీయడంతో అసలు నిజం బయటపడింది. ఏం జరిగిందంటే?

సౌత్ కొరియాలో నిర్వహించిన ట్యాక్స్ అకౌంటెన్సీ పరీక్షలో సియోక్ (34) అనే వ్యక్తి పాల్గొన్నాడు. ఈ పరీక్ష చాలా కఠినంగా ఉంటుందని, దీనిని పాస్ కావడమే కష్టమని పేరుంది. కానీ, సియోక్ మాత్రం ఏకంగా 400 మార్కులకు గాను 397.5 మార్కులు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ అసాధారణ ఫలితాన్ని చూసి తోటి అభ్యర్థులు, అధికారులు విస్మయానికి గురయ్యారు.

ఎవరు ఎంత కష్టపడి చదివినా రానటువంటి మార్కులు సియోక్‌కు రావడంతో తోటి అభ్యర్థుల్లో అనుమానాలు మొదలయ్యాయి. అతడి ప్రవర్తనపై ఆరా తీయగా, పరీక్షలో అతడు అవలంబించిన మోసపూరిత విధానం వెలుగులోకి వచ్చింది. విద్యార్థులు పదేపదే నిలదీయడంతో ఒత్తిడికి గురైన సియోక్ చివరకు తప్పు ఒప్పుకున్నాడు.

ఇవి కూడా చదవండి

ఏఐతో ఎలా మోసం చేశాడు?

సియోక్ పరీక్ష రాసే సమయంలో AI గ్లాసెస్ ధరించాడు. పరీక్షా కేంద్రంలో ఉన్న ప్రశ్నపత్రాన్ని ఆ గ్లాసుల సహాయంతో ఫొటోలు తీసి, ఆ చిత్రాలను రహస్యంగా తన మొబైల్ ఫోన్‌కు పంపాడు. బ్యాక్‌ఎండ్‌లో ఉన్న AI టూల్ లేదా సహచరుల సాయంతో ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలను రాబట్టుకుని పరీక్షలో అగ్రస్థానంలో నిలిచాడు. మోసం బయటపడటంతో అతడు నేరుగా పోలీసులకు లొంగిపోయాడు.

టెక్నాలజీని మంచికోసం ఉపయోగిస్తే అద్భుతాలు సృష్టించవచ్చు. కానీ, ఇలాంటి అక్రమ మార్గాలకు ఉపయోగిస్తే చట్టపరమైన శిక్షలు తప్పవని ఈ సంఘటన మరోసారి నిరూపించింది. పరీక్షల నిర్వహణలో ఏఐ గ్లాసెస్ వంటి ఆధునిక పరికరాలను అడ్డుకోవడానికి అధికారులు మరింత కఠిన భద్రతా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ ఉదంతం హెచ్చరిస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us