Viral Video: ఓరీ దేవుడో ఇదేక్కడి కర్మరా సామీ.. చెప్పులతో పకోడీల తయారీ..! ఎలా తింటారంటే..

ఓరీ దేవుడో.. చెప్పులతో చేసిన పకోడీలు మార్కెట్లోకి వచ్చాయి. వాటిని చూసిన ప్రజలు షాక్‌ అవుతున్నారు. మనం కాళ్లకు వేసుకునే స్లిప్పర్స్‌తో పకోడీ తయారు చేస్తున్నారు. ఇక్కడ మరో వింత విషయం ఏంటంటే..ఆయిల్‌ వేసిన తరువాత ఆ చెప్పులు ఉప్పొంగుతాయి. ఇలాంటి వింత వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది మిమ్మల్ని నిజంగా షాక్‌కు గురి చేస్తుంది. అయితే, ఈ వీడియో వెనుక ఉన్న నిజం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

Viral Video: ఓరీ దేవుడో ఇదేక్కడి కర్మరా సామీ.. చెప్పులతో పకోడీల తయారీ..! ఎలా తింటారంటే..
Chappal Pakaudi

Updated on: Jun 21, 2025 | 3:52 PM

సాధారణంగా బజ్జీలు అంటే అందరూ ఇష్టపడతారు. చలికాలం, వర్షాకలంలో సాయంత్రం వేళల్లో ఎక్కువగా బజ్జీలు తింటుంటారు. వీటిలో ఆలూ బజ్జీ, ఉల్లిపాయ పకోడీ, మిరపకాయ, పాలకూర, క్యాబేజీ, పనీర్ పకోడీలు ఇలా అనేక వెరైటీల్లో బజ్జీలు తయారు చేస్తుంటారు. కొందరు కరివేపాకు, వాము ఆకులు, తమలపాకు ఆకులతో కూడా పకోడీ తయారు చేస్తుంటారు. ఈ బజ్జీలు, పకోడీ రుచి ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. కానీ, మీరెప్పుడైనా చెప్పులతో చేసిన పకోడీలను రుచి చూశారా..? చీ..చీ ఇదేం పకోడీ అనుకుంటున్నారా..? అవును సోషల్ మీడియాలో ఈ వెరైటీ వంటకం ఇప్పుడు ట్రెండ్‌గా మారింది.

ఓరీ దేవుడో.. చెప్పులతో చేసిన పకోడీలు మార్కెట్లోకి వచ్చాయి. వాటిని చూసిన ప్రజలు షాక్‌ అవుతున్నారు. మనం కాళ్లకు వేసుకునే స్లిప్పర్స్‌తో పకోడీ తయారు చేస్తున్నారు. ఇక్కడ మరో వింత విషయం ఏంటంటే..ఆయిల్‌ వేసిన తరువాత ఆ చెప్పులు ఉప్పొంగుతాయి. ఇలాంటి వింత వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది మిమ్మల్ని నిజంగా షాక్‌కు గురి చేస్తుంది. అయితే, ఈ వీడియో వెనుక ఉన్న నిజం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

అదేంటంటే.. ఇంటర్‌నెట్‌లో వైరల్‌ అవుతున్న ఈ చెప్పుల పకోడీ వీడియో AI సృష్టిగా చెబుతున్నారు. చెప్పులతో తయారు చేసిన పకోడీలు, ఫ్రైస్ మార్కెట్లో అమ్మకాలు ప్రారంభిస్తే ఏం జరుగుతుంది..? ఎలా ఉంటుందో ఈ వీడియో ద్వారా చూపించారు. ఇందులో ఒక అమ్మాయి చప్పులకు మసాలా పూసుకుంటూ ఆయిల్‌లో ఫ్‌రై చేస్తుంది. మరో అమ్మాయి గ్రిల్ చేస్తుంది. ఇదంతా చూసిన నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. కానీ, ఇది AI విజువల్‌ అని ఆశ్చర్యపోతున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

కానీ, వీడియో చూసిన ప్రతి ఒక్కరూ దీనిపై స్పందించారు. కొందరు AI వీడియో అద్భుతంగా ఉందని రాస్తే.. మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేం క్రియేటివిటి అంటూ మండిపడుతున్నారు. ఇలా భిన్నమైన అభిప్రాయాలతో ఈ వీడియో ఇప్పటి వరకు వేల మిలియన్లలో వ్యూస్‌ సంపాదించింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..