Viral: ముసుగులో వచ్చి కాలేజీలో రూ 8 లక్షలు చోరీ – దొంగ ఎవరో తెలిసాక అందరూ అవాక్కు

రూ. 8 లక్షలు గల్లంతవ్వడంతో కళాశాలలో అలజడి.. స్టాఫ్ తలలు పట్టుకున్నారు. కాలేజ్ యాజమాన్యం వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫుటేజ్ చూస్తుంటే ఆ దొంగ కదలికలు సందేహంగా కనిపించాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే...

Viral: ముసుగులో వచ్చి కాలేజీలో రూ 8 లక్షలు చోరీ - దొంగ ఎవరో తెలిసాక అందరూ అవాక్కు
Theft

Updated on: Jul 24, 2025 | 3:13 PM

ఓ విద్యా సంస్థలో ఎవ్వరూ ఊహించని ఘటన.. రూ. 8 లక్షలు మాయం! స్టాఫ్ మొత్తం షాక్! విషయం తెలిసి.. కాలేజీలో హడావుడి మొదలైంది. ఆఫీస్ నుంచి లక్షల రూపాయలు గల్లంతవడంతో కాలేజ్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చింది. అహ్మదాబాద్ మెఘాణీనగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది.

వెంటనే కాలేజ్ చుట్టూ ఉన్న సీసీ కెమెరాలన్నీ చెక్ చేశారు పోలీసులు. ఒకే ఒక్క ఫుటేజ్ అదే క్లూ ఇచ్చింది! దొంగతన చేసిన పర్సన్ స్టైల్, చేతి కదలికలు, కళ్లద్దాల ఫ్రేమ్ చూసిన తర్వాత ఇది ఎవరో తెలిసినవాళ్ల పనే అర్థమైంది… అంతే.. అనుమానం ఒకరిపైనే. తానే విద్యార్థులకు మార్గం చూపాల్సిన వ్యక్తి… ఆ విద్యా సంస్థను భుజాలపై నడపాల్సిన పర్సన్.. యస్.. లేడీ వైస్ ప్రిన్సిపాల్ గారే దొంగతనానికి పాల్పడ్డారు.

ఆమె ఆరు నెలలుగా ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసగా మారారు. లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు. ఆ నష్టాన్ని తీర్చడానికి ఏం చేయాలో తెలియక.. తాను పనిచేస్తున్న కాలేజ్ నుంచి డబ్బు దొంగిలించారు. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకుని పోలీసులు ఆరా తీస్తున్నారు.
చేసిన తప్పు ఒప్పుకున్న ఆమెపై కేసు నమోదైంది. ఆడిన ఆటే జీవితాన్ని కటకటాలు పాలు చేసింది.

Vice Principal

 

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..