Viral: ‘మొగుడితో మందు పార్టీ..’ మరీ ఇలా ఉన్నావ్.. ఇదేం వింత కోరిక తల్లీ.. చూస్తే గుండె జారే

తాగుబోతు భర్త రోజూ భార్యను వేధించడం, తాగుబోతు భర్త చేసే గొడవలకు విసిగి వేసారని భార్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం లాంటి వార్తలు మనం తరచూ చూస్తూనే ఉంటాం. అయితే ఇక్కడే ఓ విచిత్రమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది.

Viral: మొగుడితో మందు పార్టీ.. మరీ ఇలా ఉన్నావ్.. ఇదేం వింత కోరిక తల్లీ.. చూస్తే గుండె జారే
Representative Image

Updated on: Jul 12, 2024 | 1:36 PM

తాగుబోతు భర్త రోజూ భార్యను వేధించడం, తాగుబోతు భర్త చేసే గొడవలకు విసిగి వేసారని భార్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం లాంటి వార్తలు మనం తరచూ చూస్తూనే ఉంటాం. అయితే ఇక్కడే ఓ విచిత్రమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. భార్య మద్యానికి బానిసై భర్తను వేధించింది. అంతటితో ఆగకుండా.. ఆమె తాగడమే కాదు.. భర్తను కూడా తనతో పాటు మద్యం సేవించాలని బలవంతం చేసింది. దీంతో సదరు భర్త.. ఆమెతో విడాకులు కావాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు.

ఇది చదవండి: నిద్రపోయే భంగిమను బట్టి మీ వ్యక్తిత్వాన్ని చెప్పేయొచ్చు..! ఎలాగో తెల్సా

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలో ఓ వ్యక్తి తన భార్య అతిగా తాగుడుకు బానిసైందని, తనను కూడా బలవంతంగా మద్యం తాగిస్తోందని ఆరోపించాడు. అలాగే ఆ భార్య తాగుడుకు విసిగిపోయిన భర్త.. ఆమెను వదిలేసి.. ఇంటి నుంచి పరారయ్యాడు. అనంతరం ఈ వివాదం కాస్తా విడాకుల వరకు చేరుకుంది. దీంతో భర్త చేసిన ఈ పనికి ఆగ్రహించిన భార్య.. పోలీస్ స్టేషన్‌కు చేరుకుని అతడిపై ఫిర్యాదు చేసింది. అనంతరం వివాదాన్ని పరిష్కరించేందుకు పోలీసులు వారిద్దరినీ సైకాలజిస్ట్ దగ్గరకు తీసుకెళ్లారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ఆషాడంలో భార్యాభర్తలు కలిస్తే ఏమవుతుందో తెల్సా.? ఎందుకు కలిసి ఉండకూడదంటే

కౌన్సెలింగ్ సెంటర్‌లోనూ భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగిందని, రోజూ మూడు నాలుగు పెగ్గులు తాగుతూ తనను కూడా తాగమని వేధించేది. దీంతో విసిగిపోయి ఆమెను ఇంటి వద్ద వదిలేశానని భర్త ఆరోపించాడు. భర్త ఆరోపణలన్నింటిని అంగీకరించిన భార్య.. తనను కొట్టి ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడని రివర్స్ ఎటాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ దంపతుల మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఇది చదవండి: ‘హాయ్ ఫ్రెండ్స్.! ఈరోజు మా ఫస్ట్ నైట్’.. వీడియో షేర్ చేసిన కొత్త జంట.. ఇదేం బూతు పురాణం

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి