
ఈ రోజుల్లో ఒక్కరూ ఇద్దరు పిల్లల్ని కనాలంటేనే నరకంగా ఉంది పరిస్థితి. ఇక వారి పెంపకం మరింత భారంగా మారుతోంది. అలాంటిది ఒక మహిళ ఏకంగా పది మంది కూతుళ్ల తరువాత మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ వార్త ఆ ఇంటిల్లిపాదిని సంతోషంలో ముంచేసింది. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. ఈ ఘటన హర్యానాలోని జింద్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని ఉచానా నగరంలోని ఓజాస్ హాస్పిటల్ ప్రసూతి గృహంలో 37 ఏళ్ల మహిళ ప్రసవ నొప్పితో చేరింది. మరుసటి రోజు, ఆ మహిళ ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ వార్త విన్న తండ్రితో సహా మొత్తం కుటుంబం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఫతేహాబాద్ జిల్లాలోని ఒక గ్రామానికి చెందిన ఈ జంట 19 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు. కానీ, ఇప్పటివరకు ఆ దంపతులు పది మంది సంతానానికి జన్మనిచ్చారు. వారంతా ఆడపిల్లలే కావటంతో వారు 11వ కాన్పు కోసం ఎదురు చూశారు. మొదటి కుమార్తె సెకండ్ పియుసి చదువుతోంది. మిగిలిన వారు పాఠశాలకు వెళుతున్నారు. కానీ, కొడుకు పుట్టాలనేది ఆ కుటుంబానికి ఉన్న అతిపెద్ద కోరిక. మొత్తం కుటుంబం కోరిక నెరవేరిందని వారు సంతోషం వ్యక్తం చేశారు.
ప్రసవ సమయంలో ఆమెకు చాలా ఇబ్బందులు ఎదురైనప్పటికీ, చివరికి అంతా బాగానే జరిగిందని వైద్యులు చెప్పారు. తల్లి, బిడ్డకు ఎటువంటి సమస్య లేదని తెలిపారు. ఇద్దరూ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయి తమ గ్రామానికి తిరిగి వెళ్లారని చెప్పారు. ఈ సందర్భంగా ఆ చిన్నారి తండ్రి సంజయ్ కుమార్ మాట్లాడుతూ, తమ కుటుంబం మొత్తం మగబిడ్డ కోసం ప్రార్థించిందని చెప్పారు. తమకు మగబిడ్డ కావాలని ఎంతో ఆశగా ఎదురు చూశామని అన్నారు.. ఆడబిడ్డలు కూడా తమ్ముడిని కోరుకున్నారు. దేవుని చిత్తం ప్రకారం, పది మంది ఆడపిల్లల తర్వాత పదకొండవ సంతానంగా మగబిడ్డ పుట్టడం పట్ల సంతోషంగా ఉన్నామని అన్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..