Telugu News Trending A video of a woman falling from the top of an escalator has gone viral on social media Telugu news
Video Viral: ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయో ఏమో.. వారు చేసిన పనికి ఆస్పత్రి పాలైన మహిళ..
మీరు ఎప్పుడైనా ఎస్కలేటర్ (Escalator) ఎక్కారా.. నగరాల్లో ఉండే వాళ్లకు ఇది సాధారణ విషయమే అయినా మొదటిసారి ఎక్కేవారు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారికి ఇది పూర్తిగా కొత్త అనుభవం. వారు ఎస్కలేటర్ ఎక్కేందుకు...
మీరు ఎప్పుడైనా ఎస్కలేటర్ (Escalator) ఎక్కారా.. నగరాల్లో ఉండే వాళ్లకు ఇది సాధారణ విషయమే అయినా మొదటిసారి ఎక్కేవారు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారికి ఇది పూర్తిగా కొత్త అనుభవం. వారు ఎస్కలేటర్ ఎక్కేందుకు చాలా భయపడుతుంటారు. దానిపై నుంచి పడిపోతామని ఆందోళన చెందుతుంటారు. అందుకే ఎస్కలేటర్ తో కొందరు ఫన్ కూడా క్రియేట్ చేస్తుంటారు. అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో చాలానే ఉన్నాయి. ఎస్కలేటర్ పై ఎక్కడం, దిగడం, నడవడం, పరిగెత్తడం, డ్యాన్స్ చేయడం వంటి వీడియోలు మనం చూసే ఉన్నాం. వాటిని చూసేందుకు నెటిజన్లు కూడా ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఎస్కలేటర్ పై ప్రమాదానికి సంబంధించిన వీడియోలు (Videos) మీరు ఎప్పుడైనా చూశారా.. లేకపోతే ఇప్పుడు చూసేయండి. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ క్లిప్ లో ఇద్దరు మహిళలు ఎస్కలేటర్ పై పెద్ద లగేజ్ బ్యాగ్ ను పెడతారు. ప్రమాదవశాత్తు ఆ బ్యాగ్ అదుపుతప్పి కిందికి పడిపోతుంది. ఎస్కలేటర్ దిగుతున్న మరో మహిళ బ్యాగ్ కింద పడిపోవడాన్ని చూసి తీవ్ర ఆందోళనకు గురైంది. వెంటనే వేగంగా కిందికి దిగుతుంది. ఆ సమయంలో అదుపు తప్పి కింద పడిపోయింది.
వీడియో చూస్తే ఆమెకు బలమైన గాయాలే తగిలినట్లు అర్థమవుతోంది. అక్కడ ఉన్నవారు వెంటనే అప్రమత్తమైన బాధితురాలిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ అయింది. కేవలం 14 సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియోకు ఇప్పటివరకు 1 లక్షా 28 వేలకు పైగా వ్యూస్య, 2 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. ఈ సంఖ్య ఇంకా పెరుగుతోంది. వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. తమ అభిప్రాయాలు పంచుకుంటూ వ్యాఖ్యలు రాస్తున్నారు.