United Airlines: విమానం ల్యాండ్ అవుతుండగా ఊడిన ముందుటైర్.. అంతలోనే

అమెరికాలోని ఓర్లాండా ఇంటర్నేషనల్ ఎయిర్‌ పోర్టులో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. అమెరికాకు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం రన్‌వైపై ల్యాండ్‌ అవుతుండగా.. ఒక్కసారిగా దాని టైర్ ఊడిపోయింది. గమనించిన పైలట్ అప్రమత్తమై ఫ్లైట్‌ను సేఫ్‌గా ఆపేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతుంది.

United Airlines: విమానం ల్యాండ్ అవుతుండగా ఊడిన ముందుటైర్.. అంతలోనే
United Airlines Orlando Landing Issue

Updated on: Jan 19, 2026 | 3:03 PM

విమానం ల్యాండ్‌ అవుతుండగా దాని టైర్ ఊడిపోయిన ఘటన అమెరికాలోని ఓర్లాండా అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. గమనించిన పైలట్ అప్రమత్తమై చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణనష్టం గాని ప్రయాణికులకు గాయాలు కాలేదని అమెరికాకు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ స్పష్టం చేసింది.

వివరాల్లోకి వెళ్తే.. యునైటెడ్ ఎయిర్‌లైన్స్ వెబ్‌సైట్ ప్రకారం, యునైటెడ్ ఫ్లైట్ 2323 అనే విమానం సిబ్బందితో సహా మొత్తం 206 మంది ప్రయాణికులతో కలిసి చికాగోలోని ఓ’హేర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఉదయం 8:55 గంటలకు ఓర్లాండోకు బయలుదేరింది. సరిగ్గా మధ్యాహ్నం 12:35 గంటలకు ఓర్లాండో ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయింది. అయితే విమానం ల్యాండింగ్ సమయంలో సాంకేతిక సమస్య కారణంగా విమానం ముందు ఉండే రెండిట్లలో ఒక టైర్ ఊడిపోయింది.

అది గమనించి అప్రమత్తమైన పైలట్ వెంటనే చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని ఆపగలిగాడు. దీంతో విమానంలోని ప్రయాణికులు సిబ్బందితో పాటు ఎయిర్‌పోర్టులోని అధికారులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై సదురు విమానాయనాయ సంస్థ స్పందిస్తూ ఈ ప్రమాదంలో ప్రయాణికులు ఎటువంటి గాయాలు కాలేదని.. అందరూ సురక్షితంగానే ఉన్నారని స్పష్టం చేసింది. విమానంలోని ప్రయాణికులందరి బస్సు సహాయంతో టెర్మినల్‌కు చేర్చామని.. ఈ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తు్న్నట్టు చెప్పుకొచ్చింది.

వీడియో చూడండి..

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.