Viral Video: కండ బలం కంటే బుద్ధి బలమే గొప్పది.. ఈ వీడియో చూస్తే మీరు కూడా ఒప్పుకోవాల్సిందే..

|

Sep 16, 2021 | 7:25 PM

Viral Video: హార్డ్‌ వర్క్‌ కాదు.. స్మార్ట్‌ వర్క్‌ చేయాలని చెబుతుంటారు. గంటల తరబడి చేసే శారీరక శ్రమతో చేసే పనిని కూడా స్మార్ట్‌ ఆలోచనతో చాలా ఈజీగా చేయొచ్చు. దీనివల్ల పని వేగంగా...

Viral Video: కండ బలం కంటే బుద్ధి బలమే గొప్పది.. ఈ వీడియో చూస్తే మీరు కూడా ఒప్పుకోవాల్సిందే..
Follow us on

Viral Video: హార్డ్‌ వర్క్‌ కాదు.. స్మార్ట్‌ వర్క్‌ చేయాలని చెబుతుంటారు. గంటల తరబడి చేసే శారీరక శ్రమతో చేసే పనిని కూడా స్మార్ట్‌ ఆలోచనతో చాలా ఈజీగా చేయొచ్చు. దీనివల్ల పని వేగంగా జరగడంతో పాటు కచ్చితత్త్వంతో జరుగుతుంది. దీనికి ఎన్నో ఉదాహరణాలున్నాయి. అయితే తాజాగా నెట్టింట వైరల్‌ అవుతోన్న ఓ వీడియో దీనికి సాక్ష్యంగా నిలుస్తోంది. ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఇది నిజమేనని ఒప్పుకుంటారు.

ఇంతకీ విషయమేమిటంటే.. ఓ అడవిలో చెట్లను నరికిన తర్వాత దుంగలను లారీలోకి ఎక్కించాల్సి వచ్చింది. అయితే సహజంగా భుజాలపై లేదా చేతులతో మోస్తూ వాటిని తరలిస్తుంటారు. కానీ కొందరు కూలీలు మాత్రం దీనికి భిన్నంగా ఆలోచించారు. హార్డ్‌ వర్క్‌ను కాకుండా స్మార్ట్‌ వర్క్‌ను నమ్ముకున్నారు. పెద్ద పెద్ద దుంగలను సింపుల్‌గా లారీలోకి ఎక్కించడానికి ముందుగా లారీపై నుంచి కింది వరకు రెండు పెద్ద కర్రలను అమర్చారు. అనంతరం ఆ దుంగకు తాడును జోడించి రెండు కర్రలపై నుంచి పైకి లాగడం ప్రారంభించారు. సుమారు 100 కిలోలకు పైగా ఉండే ఆ దుంగలను ఈ ట్రిక్‌తో సింపుల్‌గా లారీలోకి ఎక్కించారు.

ఈ వీడియోను తేజాన్‌ శేఖర్‌ అనే ఐఎఫ్‌ఎస్‌ ఆఫీసర్‌ ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో ఈ వీడియో కాస్త వైరల్‌గా మారింది. కార్మికు స్మార్ట్‌ వర్క్‌ను చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్లు ‘వాట్‌ ఏ ఐడియా సర్‌ జీ’, ‘టీమ్‌ వర్క్‌తో ఏదైనా సాధించవచ్చు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి ఈ స్మార్ట్‌ వర్క్‌కు సంబంధించిన వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..

Also Read: Viral Photo: కొండల మధ్య దాక్కున్న మంచు చిరుతను కనిపెట్టండి.. ఈ ఫోటోలో ఎక్కడుందో గుర్తించండి!

Priyanka Gandhi: ప్రియాంక గాంధీ ఆ సాహసం చేస్తారా? యూపీలో అక్కడి నుంచి పోటీచేస్తారా?

Cat Viral Video: ‘కాపీ క్యాట్’ అన్న పదానికి ఈ పిల్లి సరిగ్గా సరిపోతుంది.. మార్జాలం చేసిన పని చూస్తే..