షాప్ ముందు వధువు కావలెను అని బోర్డ్ పెట్టాడు.. ఫ్రెండ్ ఇచ్చిన షాక్ మాములుగా లేదు.. ఎక్కడో తెలుసా.

|

Sep 01, 2021 | 12:38 PM

వధువు, వరుడు కావలెను అనే ప్రకటనలు సాధారణంగా పేపర్స్‏లలో, మ్యాట్రిమోనీ సైట్స్‏లలో రెగ్యూలర్‏గా చూస్తుంటాం. ఇక ప్రస్తుతం

షాప్ ముందు వధువు కావలెను అని బోర్డ్ పెట్టాడు.. ఫ్రెండ్ ఇచ్చిన షాక్ మాములుగా లేదు.. ఎక్కడో తెలుసా.
Viral Photo
Follow us on

వధువు, వరుడు కావలెను అనే ప్రకటనలు సాధారణంగా పేపర్స్‏లలో, మ్యాట్రిమోనీ సైట్స్‏లలో రెగ్యూలర్‏గా చూస్తుంటాం. ఇక ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ కాలంలో సోషల్ మీడియాలో కూడా ఇలాంటి ప్రకటనలు విచ్చలవిడిగా కనిపిస్తుంటాయి. అయితే ఓ యువకుడు మాత్రం కాస్త విభిన్నంగా ఆలోచించాడు. అందరిలాగా కాకుండా.. వెరైటీగా ఆలోచించాడు.. తన మెదడులోకి వచ్చిన ఆలోచనను వెంటనే అమలు పరిచాడు. వధువు కావాలంటూ ఏకంగా తన షాప్‏కే బోర్డ్ పెట్టాడు.

కేరళ త్రిచూర్‏లోని ఉన్ని కృష్ణన్ (33) తన పెళ్లి కోసం అనేక చోట్లకు తిరిగాడు. కానీ ఎక్కడా సంబంధం సెట్ కాలేదు. దీంతో ఏకంగా తన టీ స్టాల్ ముందు వధువు కావలెను అంటూ బోర్డ్ పెట్టాడు. కులం, మతంతో సంబంధం లేదు అనే ట్యాగ్ లైన్ కూడా ఉచ్చాడు. అలాగే ఆ బోర్డ్ పై తన ఫోన్ నంబర్ కూడా రాశాడు. అయితే ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఊహించని పరిమాణంతో ఒక్కసారిగా షాకయ్యాడు. అయితే ఉన్నికృష్మన్ తగిలించిన సైన్ బోర్డును అతని ఫ్రెండ్ ఫోటో తీసి సోషల్ మీడియాల అప్‏లోడ్ చేశాడు. దీంతో నెట్టింట్లో ఉన్నికృష్ణన్ బోర్డు తెగ వైరల్ అయ్యింది. అతనికి ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ దేశాల నుంచి కాల్స్ వస్తున్నాయి. అయితే ఉన్నికృష్ణన్‏కు ఇదంతా తెలియదు. అతను తిరిగ్గా షాపులో కూర్చుని తనకు వచ్చిన ప్రపోజల్స్ వెతికే పనిలో ఉన్నాడు. నేను రోజువారీ కూలీని. నా తలలో కణతి ఉండటంతో సర్జరీ కూడా జరిగింది. దాని నుంచి పూర్తిగా రికవరీ అయ్యాను. అందువల్ల ఇప్పుడు జీవితంలో సెటిల్ అవ్వాలనుకుంటున్నా. లక్కీగా ఓ లాటరీ తగలడంతో టీస్టాల్ పెట్టుకున్నాను. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నను. నా ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు సంబంధాలు వెతికారు. అవేవీ సెట్ కాలేదు. అందుకే ఇలా సైన్ బోర్డ్ పెట్టాను అని ఉన్నికృష్ణన్ తెలిపాడు.

Also Read: Jr.NTR: ఎన్టీఆర్ క్రికెట్ అందుకే చూడడంట.. ఆసక్తికర విషయాలను చెప్పిన యంగ్ టైగర్..

Pooja Hegde: బుట్టబొమ్మ ఖాతాలో మరో రికార్డ్.. నెట్టింట్లో సంబరాలు జరుపుకుంటున్న పూజా హెగ్డే..

Karthika Deepam: రేపు కార్తీక్‌కు నాకు పెళ్లి రెచ్చిపోతున్న మోనిత.. టెన్షన్‌లో డాక్టర్ బాబు!