Australian: ప్రైవేట్ పార్ట్స్ లో నొప్పంటూ ఆస్పత్రికెళ్లిన వ్యక్తి.. డాక్టర్స్ ఎక్స్ రే తీసీచూస్తే!
లైంగిక సంతృప్తి కోసం కొంతమంది వ్యక్తులు అనేక ప్రయోగాలు చేయడానికి కూడా వెనుకాడటం లేదు. తెలిసో తెలియకో చిత్ర విచిత్ర పద్ధతులను పాటిస్తూ ప్రాణాల మీదకు కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా ఆస్ట్రేలియాలోని 73 ఏళ్ల వ్యక్తి "లైంగిక సంతృప్తి" కోసం తన మూత్రనాళంలోకి మూడు చిన్న బ్యాటరీలను చొప్పించిన ఘటన వెలుగుచూసింది.

లైంగిక సంతృప్తి కోసం కొంతమంది వ్యక్తులు అనేక ప్రయోగాలు చేయడానికి కూడా వెనుకాడటం లేదు. తెలిసో తెలియకో చిత్ర విచిత్ర పద్ధతులను పాటిస్తూ ప్రాణాల మీదకు కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా ఆస్ట్రేలియాలోని 73 ఏళ్ల వ్యక్తి “లైంగిక సంతృప్తి” కోసం తన మూత్రనాళంలోకి మూడు చిన్న బ్యాటరీలను చొప్పించిన ఘటన వెలుగుచూసింది. దీంతో ఆ వ్యక్తి 24 గంటల్లో శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. అతను చాలాసార్లు ప్రయత్నించినప్పటికీ వాటిని తొలగించలేకపోయాడు. దీంతో వెంటనే ట్రీట్ మెంట్ కోసం డాక్టర్ల వద్దకు వెళ్లాల్సి వచ్చింది.
లైంగిక సంతృప్తి కోసం ఆ వ్యక్తి 13.5 మిమీ వెడల్పు, 3.2 మిమీ ఎత్తు గల బ్యాటరీలను ప్రైవేట్ పార్ట్ లో అమర్చుకున్నాడు. ఆ తర్వాత తొలగించడంలో విఫలం కావడంతో ఆస్పత్రికి పరుగులు తీశాడు. గతంలో కూడా లైంగిక సంతృప్తి కోసం ఆ మనిషి తన మూత్రనాళంలోకి వస్తువులను చొప్పించాడు. వాటిని తొలగించేటప్పుడు సమస్యలను ఎదుర్కోలేదు.
కానీ ఈసారి బ్యాటరీలు అమర్చుకోవడంతో సమస్య తీవ్రమైంది. ఆస్పత్రిలో అడ్మిట్ తర్వాత వైద్యులు త్వరగా బ్యాటరీలను తొలగించడానికి వెంటనే వైద్యం చేశారు. ఎందుకంటే వాటి తొలగించకపోతే రెండు గంటల్లో మనిషి ప్రాణాలకే ముప్పు ఏర్పడుతుంది. వైద్యులు బ్యాటరీలను తొలగించడానికి ఫోర్సెప్స్ ఉపయోగించాల్సి వచ్చింది. ఆ వ్యక్తి గత మూడేళ్లుగా అంగస్తంభన సమస్యతో పోరాడుతున్నాడని, షాక్‌వేవ్ థెరపీ కూడా చేయించుకున్నాడని సమాచారం. అతను డిశ్చార్జ్ అయిన పది రోజుల తర్వాత, అతను పురుషాంగం వాపు, మూత్ర విసర్జన గురించి ఫిర్యాదు చేస్తూ ఆసుపత్రికి తిరిగి వచ్చాడు. అయితే అతడికి మెరుగైన వైద్యం అందించేందుకు డాక్టర్లు గంటలకొద్దీ శ్రమించడం ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి