Viral News: ఏం విచిత్రం.! రోజుకు ఐదుసార్లు బీర్ తాగాడు.. ఏకంగా 18 కేజీల బరువు తగ్గాడట.!!

|

Apr 06, 2021 | 10:52 AM

Drinking Beer Daily: బరువు పెరగడం సమస్య నుంచి బయటపడటానికి ప్రజలు డబ్బును ఓ రేంజ్‌లో ఖర్చు చేస్తుంటారు. ప్రత్యేకమైన డైట్ ఫాలో కావడం,..

Viral News: ఏం విచిత్రం.! రోజుకు ఐదుసార్లు బీర్ తాగాడు.. ఏకంగా 18 కేజీల బరువు తగ్గాడట.!!
Follow us on

Drinking Beer Daily: బరువు పెరగడం సమస్య నుంచి బయటపడటానికి ప్రజలు డబ్బును ఓ రేంజ్‌లో ఖర్చు చేస్తుంటారు. ప్రత్యేకమైన డైట్ ఫాలో కావడం, రోజూ జిమ్‌కు వెళ్లడం వంటివి చేస్తారు. కొందరైతే డాక్టర్లను కూడా సంప్రదిస్తూ ఉంటారు. ఖరీదైన మెడిసిన వాడతారు. మరికొందరు చిన్న చిన్న ఇంటి చిట్కాలు ఫాలో అవుతారు. అయితే ఓ వ్యక్తి తాజాగా విచిత్రమైన డైట్ ఒకటి ఫాలో అయి 18 కేజీల బరువును తగ్గాడు. అదేంటో మీరు తెలుసుకుంటే ఖచ్చితంగా షాక్ అవుతారు.

అమెరికాకు చెందిన ఒక వ్యక్తి రోజూ బీర్ తాగి ఏకంగా 18 కిలోల బరువును కోల్పోయాడు. సిన్సినాటి నగరంలో నివసిస్తున్న డేల్ హాల్ అనే వ్యక్తి బరువు తగ్గడంలో భాగంగా.. ప్రతీ రోజూ టీ, కాఫీ, బీర్, వాటర్ మాత్రమే తాగాడు. ఆకలి వేసినప్పుడల్లా బీర్ తాగి బరువు తగ్గించుకున్నాడు. రోజుకు 2 నుండి 5 సార్లు బీర్ తాగాడు. కొంచెం తేలికపాటి ఆహారం అయిన పచ్చని కాయగూరలు మాత్రమే తినడం ద్వారా 18 కిలోగ్రాముల బరువును తగ్గానని చెప్పుకొచ్చాడు. ఈ డైట్‌ను సుమారు 47 రోజులు అనుసరించడం ద్వారా 18 కిలోల బరువు తగ్గినట్లుగా డేల్ తన యూట్యూబ్ ఛానల్‌లో చెప్పాడు. అలాగే బరువు తగ్గే క్రమంలో తాను ఫాలో అయిన డైట్ ప్రక్రియను సైతం నెటిజన్లతో పంచుకున్నాడు.

Also Read:

Viral: నిమిషాల్లో ప్రాణాలు తీసే మొక్క.. పాము కంటే అత్యంత ప్రమాదకరం.. తస్మాత్ జాగ్రత్త.!

”నువ్వు తోపు.. అయితే నాకేంటి”.. మొసలిని లెక్క చేయని జీబ్రా.. ఏం జరిగిందంటే.!

అద్భుత రికార్డు.. 13 బంతుల్లో 10 వికెట్లు పడగొట్టిన చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్.. అతడు ఎవరంటే.!

Shocking: మొక్క కాదు “యమపాశం’..తాకితే తగలబెడుతుంది.. అసలు ఎందుకో తెలుసా.?