బ్రిటన్‌లోని ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. పెన్షన్ కోసం తన పొరిగింటి వ్యక్తి చనిపోతే దాదాపు రెండేళ్ల పాటు ఓ ఆ మృతదేహాన్ని ఫ్రిజ్‌లో ఉంచాడు. ఎందుకంటే అదికూడా కేవలం పెన్షన్ కోసమే. వివరాల్లోకి వెళ్తే జాన్ వైన్‌రిట్(71) అనే వృద్ధుడు బర్మింగ్‌హమ్ ప్రాంతంలో నివసించేవాడు. ఇతని ఇంటి పక్కనే తన స్నేహితుడైన డామియన్ జాన్సన్( 52) అనే వ్యక్తి ఉండేవాడు. అయితే వైన్‌రిట్ 2018లో ఆరోగ్య సమస్యల వల్ల మృతి చెందాడు. దీంతో జాన్సన్ అతని మృతదేహాన్ని ఫ్రిజ్‌లో పెట్టాడు. వైన్‌రిట్‌ను చూసేందుకు కూడా అతని బంధువులు కూడా వచ్చేవారు కాదు. అతను బతికే ఉన్నాడని నమ్మించేందుకు జాన్సన్ అతని మృతదేహాన్ని అందులోనే ఫ్రిజ్‌లోనే ఉంచాడు.
వైన్‌రిట్‌కు నెలవారిగా వచ్చే పింఛన్‌ను జాన్సన్ తీసుకొనేవాడు. ఆ డబ్బులతో షాపింగ్ చేస్తూ ఎంజాయ్ చేసేవాడు. దాదాపు రెండేళ్లపాటు అతని మృతదేహాన్ని అలాగే ఫ్రిజ్‌లో ఉంచాడు జాన్సన్. అయితే ఈ విషయం పోలీసుల దాక వెళ్లడంతో 2020 ఆగస్టులో జాన్సన్‌ను అరెస్టు చేశారు. గతంలో వైన్‌రైట్‌తో కలిసి జాన్సన్ ఒక జాయింట్ ఖాతా తెరిచాడు. వృద్ధుడికి వచ్చే పెన్షన్ డబ్బు అదే ఖాతాలో పడుతుండేది. డబ్బుల కోసమే మృతుడ్ని ఫ్రీజర్‌లో ఉంచినట్లు పోలీసుల ముందు జాన్సన్ అంగీకరించాడు. ఇటీవల అతడ్ని స్థానిక కోర్టులో హాజరుపర్చగా.. ఖాతాను వినియోగించుకునేందుకు జాన్సన్ అర్హుడని కోర్టు భావించింది. చివరికి అతనికి బెయిల్ మంజూరు చేసింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..