Watch Video: ఆలయంలోనే అనంత లోకాలకు.. దేవుడి దర్శనం కోసం వచ్చి, అందరు చూస్తుండగానే..

ఇటీవల హృదయ సంబంధిత వ్యాధులతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. మరీ ముఖ్యంగా గుండె వ్యాధుల కారణంగా మరణిస్తున్న వారు ఎక్కువుతున్నారు. ఇటీవలి కాలంలో సోషల్‌ మీడియా వేదికగా కొన్ని వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. హార్ట్‌ ఎటాక్‌ కారణంగా ప్రజలు అక్కడికక్కడే..

Watch Video: ఆలయంలోనే అనంత లోకాలకు.. దేవుడి దర్శనం కోసం వచ్చి, అందరు చూస్తుండగానే..
Temple Viral Video

Updated on: Dec 04, 2022 | 11:11 AM

ఇటీవల హృదయ సంబంధిత వ్యాధులతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. మరీ ముఖ్యంగా గుండె వ్యాధుల కారణంగా మరణిస్తున్న వారు ఎక్కువుతున్నారు. ఇటీవలి కాలంలో సోషల్‌ మీడియా వేదికగా కొన్ని వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. హార్ట్‌ ఎటాక్‌ కారణంగా ప్రజలు అక్కడికక్కడే కుప్ప కూలిపోయిన తాలూకు వీడియోలు సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్నాయి. తక్కువ వయసున్న వారి అకాల మరణాలు భయపెడుతున్నాయి. సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్‌ అయిన దృశ్యాలు నెటిజన్లను ఆందోళనకు గురి చేస్తున్నాయి.

తాజాగా ఇలాంటి ఓ ఘటనే నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. మధ్యప్రదేశ్‌లోని కట్నీ జిల్లాలో జరిగిందీ సంఘటన. వివరాల్లోకి వెళితే ఓ భక్తుడు సాయిబాబా ఆలయానికి వెళ్లాడు. ఆ సమయంలో దేవుడి చుట్టూ ప్రదక్షణలు చేసిన తర్వాత సాయి బాబా పాదాలను నమస్కరించాడు. తర్వాత పాదాల వద్ద తల పెట్టి కళ్లు మూసుకున్నాడు. అయితే చాలా సేపటి వరకు అతనిలో కదలిక లేదు. అక్కడున్న కొందరు మహిళలు ఈ విషయాన్ని పక్కవారికి తెలియ జేశారు.

ఇవి కూడా చదవండి

దీంతో అక్కడున్న ఓ వ్యక్తి అతని వద్దకు వెళ్లి కదిలించే ప్రయత్నం చేశాడు. కానీ అతను ఎంతకీ కదలకపోవడంతో మరణించినట్లు నిర్ధారించారు. అనంతరం అతన్ని ఆలయం నుంచి బయటకు తీసుకెళ్లారు. ఇదంతా అక్కడే ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో రికార్డ్‌ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. చూడడానికి యంగ్‌లా కనిపిస్తోన్న ఆ వ్యక్తి అలా ఉన్నపలంగా మరణించడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..