Viral: వృద్దుడి సాహసం.. దొంగతో భీకర పోరాటం.. షాకింగ్ దృశ్యాలు.. వీడియో వైరల్!

|

Apr 06, 2021 | 10:44 AM

Old Man Fights Carjacker: ఈ మధ్యకాలంలో సీనియర్ సిటిజన్స్‌ దొంగలకు ప్రధాన లక్ష్యంగా మారారు. ఎందుకంటే వారు పోరాటం చేయలేరు...

Viral: వృద్దుడి సాహసం.. దొంగతో భీకర పోరాటం.. షాకింగ్ దృశ్యాలు.. వీడియో వైరల్!
Old Man Fight
Follow us on

Old Man Fights Carjacker: ఈ మధ్యకాలంలో సీనియర్ సిటిజన్స్‌ దొంగలకు ప్రధాన లక్ష్యంగా మారారు. ఎందుకంటే వారు పోరాటం చేయలేరు. అంతేకాకుండా వారుంటే తమ మార్గం సుగమం అవుతుందని ఆ దొంగల భావన. కానీ సీన్ రివర్స్ అయింది. ఇటీవల అమెరికాలోని అట్లాంటాలో జరిగిన ఓ ఘటనలో 82 ఏళ్ల వృద్ధుడి దొంగతనానికి వచ్చిన వ్యక్తికి ఎదురు తిరిగాడు. ధీటుగా పోరాడాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డు కావడంతో అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

వీడియో ప్రకారం.. ఒక వ్యక్తి గ్యాస్ స్టేషన్ వెలుపల వేచి ఉన్నట్లుగా చూడవచ్చు. కొద్దిసేపటికి ఆ వ్యక్తి ఓ వృద్దుడి దగ్గరకు వెళ్లి కారు తాళాలు ఇవ్వమంటూ గద్దిస్తాడు. కానీ ఆ పెద్దాయన అందుకు ఒప్పుకోడు. దీనితో ఆ వ్యక్తి తుపాకీ తీసి బెదిరిస్తాడు. అయినా ఆ హఠాత్పరిణామానికి బెదరని ఆ వృద్దుడి ధైర్యంగా ఆ వ్యక్తితో పోరాటానికి దిగుతాడు. కొద్దిసేపు వారిద్దరి మధ్య కొట్లాట జరిగింది. ఏది ఏమైనా చివరికి చేసేదేమీలేక ఆ దొంగ కాలినడకన పారిపోతాడు. ఈ ఘర్షణలో ఆ వృద్దుడికి పలు చిన్న చిన్న గాయాలు అయ్యాయి. కాగా, ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వృద్ధుడి పోరాట దృశ్యాల వీడియో…

Also Read:

Viral: నిమిషాల్లో ప్రాణాలు తీసే మొక్క.. పాము కంటే అత్యంత ప్రమాదకరం.. తస్మాత్ జాగ్రత్త.!

”నువ్వు తోపు.. అయితే నాకేంటి”.. మొసలిని లెక్క చేయని జీబ్రా.. ఏం జరిగిందంటే.!

అద్భుత రికార్డు.. 13 బంతుల్లో 10 వికెట్లు పడగొట్టిన చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్.. అతడు ఎవరంటే.!

Shocking: మొక్క కాదు “యమపాశం’..తాకితే తగలబెడుతుంది.. అసలు ఎందుకో తెలుసా.?