Viral News: ప్రేమకోసమై..గర్ల్‌ఫ్రెండ్‌ను ఇంప్రెస్ చేయడానికి ఇద్దరు యువకులు ఏం చేశారంటే..

వారిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయట పడిందని పోలీసు అధికారులు తెలిపారు. కమల్ తన గర్ల్‌ఫ్రెండ్‌ను ఇంప్రెస్ చేస్తానని చెప్పడంతో తాను..

Viral News: ప్రేమకోసమై..గర్ల్‌ఫ్రెండ్‌ను ఇంప్రెస్ చేయడానికి ఇద్దరు యువకులు ఏం చేశారంటే..
representative image

Updated on: Jul 30, 2022 | 9:12 PM

Viral News:  తన గర్ల్‌ఫ్రెండ్‌ను మెప్పించేందుకు ఓ యువకుడు దొంగగా మారాడు. తన స్నేహితునితో కలిసి ఏకంగా ఏటీఎం మిషన్‌నే కొల్లగెట్టేందుకు యత్నించాడు. కానీ, పాపం అతడి ప్రయత్నం బెడిసికొట్టింది. ఏటీఎంను ఎవరో దొంగలించేందుకు ప్రయత్నిస్తున్నారనే సమాచారం పోలీసులకు చేరటం..సదరు ప్రేమికుడు చిక్కుల్లోపడాల్సి వచ్చింది. పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని..అతనితో పాటు..తన ఫ్రెండ్‌ని కూడా అదుపులోకి అరెస్ట్‌చేసి కటకటాల్లోకి నెట్టేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

పశ్చిమ ఢిల్లీలోని రన్‌హోలా ప్రాంతంలో ఏటీఎంలో చోరీకి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను శనివారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారిని రాజస్థాన్‌లోని దౌసా జిల్లాకు చెందిన కమల్ (27), పర్వీన్ (20)గా అధికారులు గుర్తించారు. శనివారం తెల్లవారుజామున 2.15 గంటల ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు గ్యాస్ వెల్డర్‌తో ఏటీఎంను కట్‌చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పోలీసులకు సమాచారం అందిందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, వారి వద్ద ఉన్న సామాగ్రిని వదిలి ఇద్దరూ పారిపోయినట్లు గుర్తించారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని ఉపయోగించి నిందితులను గుర్తించిన పోలీసులు, బప్రోలాలోని హర్‌ఫూల్ విహార్‌లో వారిని అరెస్టు చేసినట్టు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఔటర్) సమీర్ శర్మ తెలిపారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయట పడిందని పోలీసు అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

కమల్ తన గర్ల్‌ఫ్రెండ్‌ను ఇంప్రెస్ చేస్తానని చెప్పడంతో తాను ఈ దొంగతనానికి సహాయం చేసేందుకు ఒప్పుకున్నానని ప్రవీణ్ తెలిపినట్లు పోలీసులు వివరించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్  కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us