Viral Video: రాత్రిపూట బాత్‌రూమ్‌లో వింత శబ్దాలు.. ఏంటా అని డోర్ ఓపెన్ చూసి షాక్

సోషల్ మీడియాలో నిత్యం అనేక వార్తలు వైరల్‌ అవుతుంటాయి. ఇందులో ఎక్కువగా జంతువులు, పాములు, వింత ఊర్లు, మనుషులు చేసే విచిత్రమైన పనులు ప్రజల్ని ఎక్కువగా ఆకర్షిస్తుంటాయి. అయితే, అప్పుడు కొన్ని ఇళ్లకు సంబంధించి భయానక వార్తలు కూడా ఇంటర్‌ నెట్‌లో వైరల్‌ అవుతుంటాయి. మరికొన్ని సందర్బాల్లో కొత్తగా కొనుగోలు చేసిన ఇంట్లో ఊహించిన దృశ్యాలు, నిధులు బయటపడుతుంటాయి. కానీ, ఇక్కడ వైరల్‌ అవుతున్న ఇంట్లో ఎవరూ ఊహించని ఒళ్లు గగ్గుర్పొడిచే సీన్ ఎదురైంది..ఇంతకీ ఏం జరిగిందంటే...

Viral Video: రాత్రిపూట బాత్‌రూమ్‌లో వింత శబ్దాలు.. ఏంటా అని డోర్ ఓపెన్ చూసి షాక్
Malaysian Family's Fear

Updated on: Dec 10, 2025 | 12:55 PM

సోషల్ మీడియాలో నిత్యం అనేక వార్తలు వైరల్‌ అవుతుంటాయి. ఇందులో ఎక్కువగా జంతువులు, పాములు, వింత ఊర్లు, మనుషులు చేసే విచిత్రమైన పనులు ప్రజల్ని ఎక్కువగా ఆకర్షిస్తుంటాయి. అయితే, అప్పుడు కొన్ని ఇళ్లకు సంబంధించి భయానక వార్తలు కూడా ఇంటర్‌ నెట్‌లో వైరల్‌ అవుతుంటాయి. మరికొన్ని సందర్బాల్లో కొత్తగా కొనుగోలు చేసిన ఇంట్లో ఊహించిన దృశ్యాలు, నిధులు బయటపడుతుంటాయి. కానీ, ఇక్కడ వైరల్‌ అవుతున్న ఇంట్లో ఎవరూ ఊహించని ఒళ్లు గగ్గుర్పొడిచే సీన్ ఎదురైంది..ఇంతకీ ఏం జరిగిందంటే…

వైరల్‌ వీడియోలో ఒక షాకింగ్‌ ఘటన కనిపించింది. మలేషియాలోని కెడా రాష్ట్రంలోని సుంగై పెటాని ప్రాంతంలో గల ఒక సాధారణ ఇల్లు ఉన్నట్టుండి బాగా ఫేమస్‌ అయింది. బయటి నుండి చూస్తే ఆ ఇల్లు సాధారణంగా కనిపించినప్పటికీ దాని లోపల ఒక భయంకరమైన రహస్యం దాగి ఉంది. గత కొన్ని వారాలుగా, రాత్రిపూట ఆ ఇంటి బాత్రూమ్ నుండి వచ్చే వింత శబ్దాలతో కుటుంబం ఇబ్బంది పడుతోంది. కొన్నిసార్లు అది బుసలు కొడుతున్నట్టుగా, కొన్నిసార్లు ఏదో పాకుతున్న శబ్దంలాగా, కొన్నిసార్లు పైకప్పుపై భారీ బరువు జారుతున్నట్లుగా వినిపించేది. కుటుంబ సభ్యులు అదంతా గమనిస్తూ.. ఎలుకలు లేదంటే, బల్లి కావచ్చు అనుకున్నారు. కానీ ఎట్టకేలకు ఆ రహస్యం బయటపడినప్పుడు అందరూ షాక్‌ అయ్యారు. భయంతో వణికిపోయారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

వారి ఇంట్లో బాత్రూమ్ పైకప్పులోంచి ప్రతి రోజూ రాత్రి పూట వింతగా, పెద్ద పెద్ద శబ్ధాలు రావడంతో కుటుంబ సభ్యులు భయపడ్డారు. చివరకు ఆ శబ్ధాలు ఏంటో చూడాలని పరిశీలించగా 16 అడుగుల పొడవు 60 కిలోల బరువున్న భారీ కొండచిలువ బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నట్లు గుర్తించారు. అది తెలిసిన కుటుంబీకులు వెంటనే జంతు సంరక్షణ బృందానికి సమాచారం అందించారు. రెస్క్యూ టీం సంఘటనా స్థలానికి చేరుకుంది. ఎంతో కష్టపడి ఆ కొండచిలువను బయటకు తీసి బంధించారు. నివాస ప్రాంతాలకు దూరంగా అడవిలో విడిచిపెట్టారు. టిక్యులేటెడ్ పైథాన్‌లు మలేషియాలో సర్వసాధారణం. కానీ ఇంత పెద్దవి, ఇంటి లోపల కనిపించడం చాలా అరుదు అంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..