Viral News: ఓరీ దేవుడో.. ఎంతపెద్ద కొండచిలువ.. మేకను సజీవంగా మింగేస్తుంటే చూసిన జనాలను..

|

Oct 25, 2023 | 12:19 PM

అయితే మేక కనిపించిన వెంటనే కొండచిలువ దానిపై దాడి చేసిందన్నారు.. కొండచిలువ పూర్తిగా కదలలేక పోవడంతో దానిని పట్టుకునేందుకు ఆ శాఖ పెద్దగా శ్రమించాల్సిన పనిలేకపోయింది. 25 నిమిషాల్లోనే కొండచిలువను అదుపు చేశారు. అంతరం ఆ కొండచిలువను అడవిలో సురక్షితంగా విడిచిపెట్టారు. అంతకు ముందుగా పెనిన్సులర్ మలేషియా డిపార్ట్‌మెంట్ వన్యప్రాణి, నేషనల్ పార్క్‌లకు అప్పగించారు.

Viral News: ఓరీ దేవుడో.. ఎంతపెద్ద కొండచిలువ.. మేకను సజీవంగా మింగేస్తుంటే చూసిన జనాలను..
140kg Giant Python
Follow us on

పైథాన్ విషపూరితం కానప్పటికీ, దీనిని ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన, భయంకర పాముగానే పిలుస్తారు. ఈ పాము తన బాధితుడిని పట్టుకున్న తర్వాత, దానిని చంపిన తర్వాత మాత్రమే విడిచిపెడుతుంది. మలేషియాలోని కెడా నుంచి ఇలాంటి ఉదంతం వెలుగులోకి వచ్చింది. 23 అడుగుల పొడవైన కొండచిలువ మేకను సజీవంగా మింగేసింది. అయితే దానిని తిన్న తర్వాత కొండచిలువ కదలలేని స్థితిలో ఉండిపోయింది. నివేదిక ప్రకారం.. సుమారు 140 కిలోల బరువున్న ఈ కొండచిలువ ఆ ప్రాంతంలో భయాందోళనలు సృష్టించింది. అయితే అగ్నిమాపక సిబ్బంది దానిని చాకచక్యంగా పట్టుకుని బంధించారు. మైక్రో బ్లాగింగ్ సైట్‌లో వైరల్ అయిన ఫోటోలలో పాము పొడవు చాలా భయానకంగా కనిపిస్తుంది. ఉదయం 8.30 గంటల ప్రాంతంలో కొండచిలువ మేకను మింగినట్లు తమకు సమాచారం వచ్చిందని చెప్పారు రెస్క్యూ టీం. అనంతరం ఘటనాస్థలికి చేరుకున్న బృందం సహాయక చర్యలు చేపట్టింది.

జనావాసాల సమీపంలోకి వచ్చిన ఒక భారీ కొండచిలువ.. అక్కడ ఎదురుపడిన ఒక మేకను మింగేసింది. కానీ అవసరానికి మించి ఆహారం తీసుకోవడం వల్ల అది కదలలేకపోయింది. ఈ సంఘటన అక్టోబర్ 19న జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీం.. ఆ భారీ సర్పాన్ని పట్టి బంధించారు. 140 కిలోల బరువు, భారీ పొడవైన కొండచిలువ మేకను సజీవంగా మింగేసింది. పాము పొడవు చూసి ప్రజలు భయంతో వణికిపోయారు.

సజీవంగా ఉన్న మేకను మింగుతుండగా చూసిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఈ మేక తన ఇంటి సమీపంలోని ఎన్‌క్లోజర్‌లో ఉండగా, కొండచిలువ దాడి చేసిందని చెప్పారు. అయితే అది కనిపించిన వెంటనే కొండచిలువ దానిపై దాడి చేసిందన్నారు.. కొండచిలువ పూర్తిగా కదలలేక పోవడంతో దానిని పట్టుకునేందుకు ఆ శాఖ పెద్దగా శ్రమించాల్సిన పనిలేకపోయింది. 25 నిమిషాల్లోనే కొండచిలువను అదుపు చేశారు. కొండచిలువను అడవిలోకి విడుదల చేయడానికి ముందు పెనిన్సులర్ మలేషియా డిపార్ట్‌మెంట్ వన్యప్రాణి, నేషనల్ పార్క్‌లకు అప్పగించారు.

ఇవి కూడా చదవండి

అయితే, ఇది పైథాన్‌లో అత్యంత ప్రమాదకరమైన జాతిగా అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇవి మనుషులను కూడా మింగేస్తాయని చెప్పారు. పాములలో ఇది అతి పొడవైన జాతి అని చెప్పారు. ఇలాంటి పైథాన్‌లు దక్షిణ, ఆగ్నేయాసియాలో ఎక్కువగా కనిపిస్తాయని చెప్పారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..