Breaking News
  • ఢిల్లీ భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. 2 లక్ష 16 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 216919. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 106737. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 104106. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 6075. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • జిహెచ్‌ఎంసి స్టాండింగ్ క‌మిటీ ఎన్నిక‌ల‌కు షెడ్యూల్ విడుదల చేసిన కమిషనర్ లోకేష్ కుమార్ . కొత్త స్టాండింగ్ క‌మిటీ ఎంపిక‌కు రేపు ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ . ఈ నెల 10 నుండి 18 వ‌ర‌కు నామినేష‌న్ల స్వీక‌ర‌ణ .
  • ఇంటర్ బోర్డ్ , ఎగ్జామినర్ ల మధ్య బస్ ఛార్జ్ ల లొల్లి. పేపర్ వాల్యుయేషన్ కి వచ్చే వారి కోసం ఆర్టీసీ బస్ లు ఏర్పాటు చేసిన ఇంటర్ బోర్డ్ . ఎగ్జామినర్ ల నుండి ఆ టైం లో ఛార్జ్ లు వసూలు చేయని ఆర్టీసీ. ఇంటర్ బోర్డ్ ఆర్టీసీ కి రాసిన లేఖతో టికెట్ ఛార్జ్ లు తీసుకొని ఆర్టీసీ . ఇప్పుడు ఛార్జ్ లు కట్టాలని అంటున్న ఇంటర్ బోర్డ్ .
  • పదో తరగతి పరీక్షల ఏర్పాట్లపై హైకోర్టుకు నివేదికలో విద్యా శాఖ. పదో తరగతి పరీక్ష కేంద్రాలను 2530 నుంచి 4535కి పెంచాం. పదో తరగతి విద్యార్థులకు కొత్తగా హాల్ టికెట్లు ఇవ్వడం లేదు. పరీక్ష కేంద్రాల వివరాలను విద్యార్థులకు సమాచారం ఇచ్చాం. థర్మల్ స్క్రీనింగ్ కిట్లు, మాస్కులు, గ్లవుజులు సేకరించి కేంద్రాలకు పంపించాం. కేంద్రానికి ఒకరు చొప్పున 4,535 మంది వైద్య సిబ్బంది. డీఈఓ కార్యాలయాల్లో హెల్ప్ లైన్ ఏర్పాటు.
  • తెలుగు ఐఏఎస్ అధికారికి కీలక బాధ్యతలు అమెరికాలోని భారత ప్రత్యేక ఆర్థిక దౌత్యవేత్తగా రవి కోట నియామకం ప్రధాని అధ్యక్షతన కేబినెట్ నియామకాల కమిటీ నిర్ణయం వాషిగ్టంట్ (డీసీ)లోని రాయబార కార్యాలయంలో విధులు మూడేళ్లపాటు పదవిలో కొనసాగనున్న రవి కోట.
  • తిరుమల: శ్రీవారి దర్శనాలపై టీటీడీ ఈఓ కామెంట్స్. 8వ తేది నుండి భక్తులకు దర్శనాలు కల్పించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం. రేపు మరోసారి సమావేశం నిర్వహించి దర్శన విధానాలను ప్రకటిస్తాం. భక్తుల సంఖ్య, గదుల కేటాయింపు, రవాణా, ప్రసాదాల విక్రయం, టైంస్లాట్ టికెట్ల విధానం, థర్మల్ స్క్రీనింగ్, అన్న ప్రసాద భవనం ప్రారంభం వంటి అంశాలపై అంచనాకు వచ్చాం. దర్శన విధి విధానాలను నిర్ణయించి 8వ తేది నుండి దర్శనాలు ప్రారంభిస్తాం. టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్.
  • తాడేపల్లి : తాడేపల్లి లో గల ఉండవల్లి సెంటర్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నివాసానికి అతి చేరువలో గల ఎన్టీఆర్ కట్ట మరియు క్రిస్టియన్ పేట లో ఈరోజు 4 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూడటంతో అప్రమత్తమైన అధికారులు. కాగా ఇందులో ఇద్దరు వాలంటీర్లు ఉండటంతో ప్రజలను మరింత భయభ్రాంతులకు గురి చేస్తుంది. వాలంటీర్లు ఇద్దరు గత మూడు రోజుల క్రితం తాడేపల్లి లో గల ప్రాంతాలలో పింఛన్లు పంపిణీ చేసినట్లు సమాచారం. అధికారులు తాడేపల్లి ప్రాంతం మొత్తం తమ ఆధీనంలోకి తీసుకొని అన్ని రకాల శానిటేషన్ పనులను చేస్తున్నారు.

టాప్ 10 న్యూస్ @10 am

Top 10 News of The Day 10 am 04.08.19, టాప్ 10 న్యూస్ @10 am

1.కాల్పులతో దద్ధరిల్లిన అమెరికా.. 20 మంది మృతి

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి గన్ కల్చర్‌కు అమాయక ప్రజల ప్రాణాలను బలిగొంది. భారత కాలమానం ప్రకారం శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత.. టెక్సాస్ నగరం కాల్పుల మోతతో దద్దరిల్లింది..Read More

2. కశ్మీర్‌కు వెళ్లకండి.. బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రేలియాలు హెచ్చరిక!

జమ్మూకాశ్మీర్‌లోని ఉద్రిక్తత పరిస్థితులను ప్రపంచదేశాలు నిశితంగా గమనిస్తున్నాయి. ఈ మేరకు కొన్ని దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. తమ దేశం నుంచి కశ్మీర్‌లో పర్యటించాలనుకునే యాత్రికులు…Read More

3. తాత్కాలికంగా ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు

నగంరలోని ఎంఎంటీఎస్ రైళ్లు తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే పేర్కొంది. యాకుత్‌పురా, ఫలక్‌నుమా సెక్షన్‌లో మరమ్మత్తు పనులు చేపడుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు…Read More

4. కోస్తాకు భారీ వర్ష సూచన!

కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదివారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో…Read More

5. సమ్మె విరమించండి : మంత్రి ఈటల

జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మెను వెంటనే విరమించాలని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. రోగుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని జూడాలు తమ ఆందోళనను విరమించాలని కోరారు…Read More

6. నేడు భీమవరానికి జనసేనాని

జనసేనా పార్టీ చీఫ్ పవన్‌ కళ్యాణ్‌ జిల్లాల పర్యటనకు ఇవాళ శ్రీకారం చుట్టనున్నారు. పరాజయంతో ఒకింత నైరాశ్యంలో ఉన్న కార్యకర్తల్లో ధైర్యం నింపేందుకు.. ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు..Read More

7. మరో రెండేళ్లలో పోలవరం పూర్తి : మంత్రి అనిల్‌

నవంబర్‌ 1 నుంచి పోలవరం నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ స్పష్టంచేశారు. నెల్లూరులో శనివారం మీడియాతో మాట్లాడుతూ పోలవరంలో దోపిడీ నిర్మూలన కోసమే రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్తున్నామన్నారు…Read More

8. కేంద్రానికి చెప్పకుండా ఎలా చేస్తారు? : మాజీ మంత్రి దేవినేని

పోలవరం సెగలు కక్కుతోంది. నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలకు దిగుతున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో ఏపీ ప్రభుత్వం తీరుపై విపక్ష టీడీపీ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తోంది..Read More

9. కలకాలం నిలిచేది స్నేహమొక్కటే.. ఇవాళే ” ఫ్రెండ్‌షిప్ డే

స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం.. అన్నాడొక సినీ కవి.  మానవ సంబంధాల్లో స్నేహానికున్న విలువ అలాంటిది.   బంగారం కరిగిపోవచ్చు..డబ్బు తరిగిపోవచ్చు..పువ్వు వాడిపోవచ్చు.. గుండె ఆగిపోవచ్చు.. కానీ స్నేహం మాత్రం నిలిచే ఉంటుంది… Read More

10. భారత్ వెర్సస్ వెస్టిండీస్ రెండో టీ20

విండీస్‌తో జరుగుతున్న సిరీస్‌లో భాగంగా టీమిండియా మొదటి టీ20లో విజయం సాధించింది. ఇక ఈ రెండు జట్ల మధ్య రెండో టీ20 ఇవాళ జరుగుతుంది. అమెరికాలోని ఫ్లోరిడా వేదికగా ఈ మ్యాచ్ జరగనుండగా…Read More

Related Tags