మరో రెండేళ్లలో పోలవరం పూర్తి : మంత్రి అనిల్‌

నవంబర్‌ 1 నుంచి పోలవరం నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ స్పష్టంచేశారు. నెల్లూరులో శనివారం మీడియాతో మాట్లాడుతూ పోలవరంలో దోపిడీ నిర్మూలన కోసమే రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్తున్నామన్నారు. టెండర్లు రద్దు చేయడం ద్వారా ప్రాజెక్టు మరింత ఆలస్యమవుతుందన్న విమర్శల్ని కొట్టిపారేశారు. సెప్టెంబర్‌ వరకు పోలవరంలో ఎలాంటి పనులూ జరగవని స్పష్టంచేశారు. సెప్టెంబర్‌ నాటికి టెండర్లకు సంబంధించిన వ్యవహారాలను పూర్తి చేసి కొత్త కాంట్రాక్టర్లకు పనులు అప్పగిస్తామని తెలిపారు. పారదర్శకంగా పనులు చేపట్టి అనుకున్న లక్ష్యం ప్రకారం 2021 ఆఖరుకల్లా పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఖచ్చితంగా పూర్తి చేస్తామన్నారు మంత్రి అనిల్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *