Breaking News
  • ఢిల్లీ: భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 73 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 173763. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 86422. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 82370. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 4971. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • లాక్‌డౌన్‌పై స్పష్టతనిచ్చిన కేంద్ర ప్రభుత్వం. కంటైన్మెంట్ జోన్లలో జూన్ 30 వరకు లాక్‌డౌన్ కొనసాగింపు. మిగతా ప్రాంతాల్లో దశలవారిగా ఆంక్షల తొలగింపు. రాత్రి పూట కర్ఫ్యూ కొనసాగింపు సమయం రాత్రి 9.00 నుంచి ఉదయం గం. 5.00 వరకు
  • నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంశంలో నిన్నటి హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో కెవియట్ పిటిషన్ దాఖలు. కెవియట్ దాఖలు చేసిన ఏఐసీసీ కార్యదర్శి మస్తాన్ వలీ.
  • కరోనా పేషంట్స్ కోసం రోబోట్ రూపకల్పన. కరోనా రోగులకు మెడిషన్, ఆహారాన్ని అందించడం కోసం ఔరంగాబాద్‌లో రోబోట్ రూపకల్పన. మహారాష్ట్ర లో ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థి సాయి సురేష్ రూపొందించాడు.
  • దేశ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన సికింద్రాబాద్ ప్రజలకు, ప్రధాని మోదీకి, పార్టీ పెద్దలకు ధన్యవాదాలు. 200కు పైగా దేశాలు కరోనా బారిన పడ్డాయి. ప్రపంచంలో ఏదేశంతో పోల్చి చూసినా భారత్ మెరుగైన పరిస్థితిలో ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునైటెడ్ నేషన్స్ అభినందిస్తున్నాయి. ఏ కొలమానంతో పోల్చి చూసినా భారత్ అత్యంత మెరుగ్గా పనిచేసింది. కిషన్ రెడ్డి, హోం సహాయ మంత్రి.
  • అవుటర్ టోల్ గేట్ల వద్ద క్యాష్ లెస్ ట్రాన్సక్షన్స్ ప్రాధాన్యత. కరోనా నేపథ్యంలో క్యాష్ లెస్ ట్రాన్సక్షన్స్ ప్రాధాన్యత అంటున్న హెచ్ ఎం డి ఏ. ఓ ఆర్ ఆర్ పై రికార్డు స్థాయిలో ఫాస్టాగ్ యూజర్స్. నిత్యం ప్రయాణించే లక్షా 30 వేల వాహనాల్లో 60 వేలు ఫాస్టాగ్​ యూజర్స్​ . 2018 డిసెంబర్​ 11వ తేదీ నుంచి అమలులోనికి వచ్చిన ఫాస్టాగ్​ నిబంధనలు . ఫాస్టాగ్​ లేని వాహనదారులు నగదు రహిత లావాదేవీలు జరపాలంటున్న హెచ్​ఎండిఏ.
  • వందేభారత్ మిషన్ లో భాగంగా ఢిల్లీ నుండి మాస్కోకు వెళుతున్న ఎయిర్ ఇండియా (AI-1945) పైలెట్ కి కరోనా పాజిటివ్. కరోనా పాజిటివ్ రావడం తో ఫ్లైట్ వెనక్కి తిరిగి వస్తుందని అధికారులు వెల్లడి.

కలకాలం నిలిచేది స్నేహమొక్కటే.. ఇవాళే ” ఫ్రెండ్‌షిప్ డే”

Friendship Day 2019: Not all friendships are meant to last forever, కలకాలం నిలిచేది స్నేహమొక్కటే.. ఇవాళే ” ఫ్రెండ్‌షిప్ డే”

స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం.. అన్నాడొక సినీ కవి.  మానవ సంబంధాల్లో స్నేహానికున్న విలువ అలాంటిది.   బంగారం కరిగిపోవచ్చు..డబ్బు తరిగిపోవచ్చు..పువ్వు వాడిపోవచ్చు.. గుండె ఆగిపోవచ్చు.. కానీ స్నేహం మాత్రం నిలిచే ఉంటుంది. ఒక బంధం కలకలం పదిలంగా నిలవాలంటే వారి మధ్య ఉండాల్సింది స్నేహమే.

నీ కోసం నేనున్నానంటూ తట్టే ఆత్మీయ స్పర్శే స్నేహం. స్నేహం నిత్యనూతనం, నిత్య పరిమళం. ఎలాంటి అరమరికలు లేకుండా సంతోషాన్నయినా, విషాదాన్నయినా పంచుకునేది స్నేహితుల దగ్గరే. శత్రువు ఒక్కడైనా ఎక్కువే… స్నేహితులు వందమంది అయినా తక్కువే అన్నారు స్వామి వివేకానంద. మానవ సంబంధాలన్నీ ఆర్థిక బంధాలుగా మారిపోయిన ఆధునిక కాలంలో..నిజమైన మనిషి మాయమైపోతున్నాడు. ఈ సమయంలోనే ఆత్మీయమైన స్నేహాలు, ఉన్నతమైన మానవతా విలువలు వెలుగు రేఖలుగా దారి చూపుతూనే వున్నాయి. స్నేహమంటే తన మిత్రుడి విజయానికి బలాన్నిచ్చే శక్తి. ఎప్పుడో చిన్నప్పుడు…బుడి బుడి అడుగుల బాల్యంలోనే అల్లుకునే స్నేహ బంధాలు కొన్నయితే…పరవళ్లు తొక్కే యవ్వనంలో పెనవేసుకునే అనుబంధాలు మరి కొన్ని. ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి, ఏ కాలేజీలోనో, లైబ్రరీలోనో, కలిసి నడిచే కారిడార్‌లోనో మొలకెత్తేది స్నేహం. పాఠశాల తరగతి గదిలోని ఒకే బెంచిపై, మాస్టారు బోధించే పాఠాల్లో నుంచి వచ్చే సందేహాల్లో ఊపిరి పోసుకొనేదే స్నేహం. మనతో బాటే ఎదిగి జీవితంతో మమేకమై ఒక విడదీయరాని అనుబంధమైపోతుంది.

అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం జరుపుకుంటారు. ఈ రోజున ప్రజలు తమ స్నేహితులపై ఉన్న తమ ప్రేమను వ్యక్తపరచడానికి తమ స్నేహితులతో గడుపుతారు. ఈ సందర్భంగా పువ్వులు, కార్డులు, మణికట్టు బ్యాండ్లు వంటి ఫ్రెండ్‌షిప్ డే బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు, ఇదొక సాంప్రదాయంగా వస్తోంది.

అమెరికా ప్రభుత్వం 1935 ఆగస్టు మొదటి శనివారం ఓ వ్యక్తిని చంపింది. అతని మరణవార్త విని ఆ మరుసటి రోజు అతని స్నేహితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనకు స్పందించిన అమెరికా ప్రభుత్వము వీరి స్నేహానికి గుర్తుగా అప్పటి నుంచి ఏటా ఆగస్టు మొదటి ఆదివారాన్ని స్నేహితుల దినోత్సవంగా ప్రకటించినట్లు చరిత్ర చెబుతోంది. క్రమేణా ప్రపంచవ్యాప్తంగా అనేక ఇతర దేశాలు స్నేహితులకు ఒక రోజు అంకితమిచ్చే సంప్రదాయాన్ని పాటిస్తున్నాయి.
ఐక్యరాజ్యసమితి 2011లో ఆ రోజును అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవంగా ప్రకటించింది. ఇంగ్లిష్‌ రచయిత ఎ.ఎ.మిల్నె సృష్టించిన విన్నీ ది పూహ్‌ కార్టూన్‌ క్యారెక్టర్‌ టెడ్డీబేర్‌ను ప్రపంచ స్నేహ రాయబారిగా ఐక్యరాజ్య సమితి అప్పటి ప్రధాన కార్యదర్శి కోఫీ అన్నన్‌ భార్య నానె అన్నన్‌ 1998లో ప్రకటించారు.భారత్, మలేసియా, బంగ్లాదేశ్, కొన్ని అరబ్‌ దేశాల్లో ఫ్రెండ్‌షిప్ డే సెలబ్రేషన్స్‌ను ఆగస్టు మొదటి ఆదివారం జరుపుకొంటారు. పాకిస్తాన్‌లో మాత్రం జూలై 30న చేసుకుంటారు. అర్జెంటీనా, బ్రెజిల్, ఈక్వెడార్, ఉరుగ్వేల్లో జూలై 20న నిర్వహిస్తారు.

స్నేహంలోని గొప్పదనం ఎన్నిరకాలుగా వర్ణించినా తక్కువే అని అంటారు. ఈభావాన్ని స్వయంగా అనుభవిస్తే తప్ప అందులోని మాధుర్యం అర్థంకాదు. అంతటి ఉన్నతమైన స్నేహం కోసం కేటాయించుకున్నదే స్నేహితుల రోజు. బంధాలు ఏర్పడడానికి కారణమౌతోంది. కానీ ప్రస్తుతం మారిపోయిన పరిస్థుతులలో ఇద్దరి వ్యక్తుల మధ్య అవసరాలు, అట్రాక్షన్ వల్లనే స్నేహం పుడుతోందని మనస్తత్వ శాస్త్రవేత్తలు విశ్లేషణలు చేస్తున్నారు. ఫ్రెండ్ లేనివాడు ఒక అనాథ అంటూ ప్రెంచ్ భాషలో సామెత కూడ ఉంది. ఎలాంటి అరమరికలు లేని స్నేహానికి పునాదులు వేస్తూ .. స్నేహంలో తప్పొఒప్పులను సరిచేసుకుంటూ మంచి మిత్రులుగా సాగిపోయే స్నేహితులందరికి ఫ్రెండ్‌షిప్ డే శుభాకాంక్షలు.

Related Tags