Breaking News
  • చిత్తూరు: మదనపల్లెలో మహిళా సంఘాల ఆందోళన. నిందితుడిని ఉరి తీయాలంటూ చిన్నారి వర్షిత తల్లిదండ్రుల ధర్నా. తమకు న్యాయం చేయాలంటున్న వర్షిత తల్లిదండ్రులు. రఫీని బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్. విద్యుత్‌ టవర్‌ ఎక్కిన వర్షిత కుటుంబ సభ్యులు. కిందకు దించేందుకు పోలీసుల ప్రయత్నాలు.
  • వివాదంలో జార్జిరెడ్డి సినిమా. ఏబీవీపీ విద్యార్థులను రౌడీలుగా చూపెట్టే కుట్ర జరుగుతోందని ఆరోపణ. సినిమాలో జార్జిరెడ్డి రౌడీయిజాన్ని చూపెట్టాలన్న ఏబీవీపీ. ఇప్పటికే ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కు అనుమతి నిరాకరించిన పోలీసులు. ఈ నెల 22న విడుదల కానున్న జార్జిరెడ్డి.
  • వరంగల్‌: ఏనుమాముల మార్కెట్ యార్ట్‌లో పత్తి కొనుగోళ్లు ప్రారంభం. ప్రభుత్వ హామీతో తిరిగి కొనుగోళ్లు ప్రారంభించిన కాటన్ వ్యాపారులు.
  • ఢిల్లీ చేరుకున్న ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌. సా.4గంటలకు సోనియాతో భేటీ కానున్న శరద్‌పవార్‌. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు, ఉమ్మడి కార్యాచరణపై చర్చ.
  • హైదరాబాద్‌: హైకోర్టులో అగ్రిగోల్డ్ కేసు విచారణ. తాకట్టు పెట్టిన అగ్రిగోల్డ్ ఆస్తులను వేలం వేసిన బ్యాంకర్లు. సంవత్సరం గడిచినా కొనుగోలుదారులకు అందని కన్‌ఫర్మేషన్‌ ఆర్డర్. కన్‌ఫర్మేషన్‌ ఇవ్వాలని కోరిన బ్యాంకర్లు. డిసెంబర్‌ 5న మరోసారి విచారిస్తామన్న హైకోర్టు. తదుపరి విచారణ డిసెంబర్‌ 5కు వాయిదా.
  • లోక్‌సభలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు. ప్రాంతీయ భాషా పరిరక్షణపై కేశినేని నాని ప్రశ్న. త్రిభాషా విధానాన్ని అమలు చేయాలి-కేశినేని నాని. ప్రాంతీయ భాషలను రక్షించాల్సిన అవసరం ఉంది-కేశినేని నాని. పలు అంశాలపై చర్చకు పట్టుబడుతున్న విపక్షాలు. విపక్ష సభ్యుల నినాదాల మధ్య కొనసాగుతున్న సభ. తెలుగు భాష ఉన్నతికి చర్యలు తీసుకుంటున్నాం-మంత్రి పోఖ్రియాల్‌.
  • ఆగ్రా జిల్లా పేరు మార్చే యోచనలో యూపీ సర్కార్. ఆగ్రా పేరును ఆగ్రావన్‌గా మార్చాలని యూపీ సర్కార్‌ యోచన. కాషాయికరణలో భాగంగా పేరు మారుస్తున్నారని విపక్షాల విమర్శలు. గతంలో ఫైజాబాద్‌ను అయోధ్యగా.. అలహాబాద్‌ను ప్రయాగ్‌రాజ్‌గా మార్చిన యూపీ సర్కార్.

తిరుమల బ్రహ్మోత్సవాలు: అత్యంత వైభవంగా శ్రీవారి చక్రస్నానం

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా సాగుతున్నాయి. చివరి అంకమైన చక్రస్నాన ఘట్టాన్ని వేదపండితులు మంత్రోశ్చరణ నడుమ కన్నులపండువగా నిర్వహిస్తున్నారు.

తొమ్మిది రోజులుగా వివిధ వాహనాలపై విహరించిన స్వామివారు సేదతీరేందుకు చక్రస్నానం నిర్వహించడం ఆనవాయితీ. వరహస్వామి ఆలయం వద్ద స్వామివారి చక్రత్తాళ్వార్‌కు స్నపన తిరుమంజనాదులు పూర్తిచేసి వేదపండితులు చక్రస్నాన క్రతువును జరిపిస్తున్నారు. స్వామి ప్రతినిధిగా చక్రత్తాళ్వారుకి వరాహ పుష్కరిణిలో స్నానం చేయిస్తారు. అనంతరం స్వామివారిని ఆనంద నిలయానికి తరలిస్తారు.  రాత్రి ఆలయంలో ధ్వజావరోహణం చేయడంతో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి. చక్రస్నానం అనంతరం సరోవరంలోని పవిత్రజలాలు అత్యంత మహిమాన్వితం అవుతాయన్నది పురాణ ప్రశస్తి.

సోమవారం రాత్రి శ్రీనివాసుడి అశ్వవాహన సేవ కన్నుల పండువగా జరిగింది. స్వామివారు అశ్వ వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరించారు. తిరుమలలో భారీగా వర్షం కురవడంతో ఘటాటోపం నీడన అశ్వవాహన సేవ కొనసాగింది. భగవంతుడి దశావతారాల్లో చివరి అవతారం కల్కి. కలియుగాంతాన కల్కి రూపంలో అశ్వ వాహనంపై స్వామి వారు వస్తారని భక్తుల విశ్వాసం. దుష్ట శిక్షణ, శిష్ణ రక్షణకు స్వామి వస్తారని పురాణాల గాథ. కలి దోషాలకు దూరంగా ఉండమని కల్కి రూపంలో స్వామి ప్రబోధంగా భక్తులు నమ్ముతారు.