టిక్‌టాక్‌ అనుకొని క్లిక్ చేస్తే అంతే సంగతి…

టిక్ టాక్ బ్యాన్ అయిన కొద్దిరోజులకే 'టిక్‌టాక్‌ బ్యాక్ ఎగైన్' మళ్లీ ఎంజాయ్ చేయండంటూ కొన్ని ఫేక్ మెసేజ్‌లు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

టిక్‌టాక్‌ అనుకొని క్లిక్ చేస్తే అంతే సంగతి...
Follow us

|

Updated on: Jul 07, 2020 | 8:27 AM

దేశంలో టిక్‌టాక్‌ యాప్‌ను కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేయడంతో చాలామంది దానిని మిస్సవుతున్నారు. ఇక ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. హానికరమైన లింకులను వాట్సాప్ సందేశాల ద్వారా యూజర్లకు పంపిస్తూ వారి వ్యక్తిగత డేటాను దొంగిలించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు.

టిక్ టాక్ బ్యాన్ అయిన కొద్దిరోజులకే ‘టిక్‌టాక్‌ బ్యాక్ ఎగైన్’ మళ్లీ ఎంజాయ్ చేయండంటూ కొన్ని ఫేక్ మెసేజ్‌లు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ‘టిక్‌టాక్‌ ప్రో’ పేరిట టిక్‌టాక్‌ వీడియోలను తిరిగి మీరు చూడవచ్చునని.. కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే చాలు అని ఆ మెసేజ్ సారాంశం. ఇక సదరు లింక్ క్లిక్ చేస్తే టిక్‌టాక్‌ మాదిరిగానే లోగోతో ఓ యాప్ కనిపిస్తుంది.

అయితే అది ఫేక్ యాప్ అని.. సైబర్ నేరగాళ్లు దాని ద్వారా వ్యక్తిగత డేటాను దొంగలించే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. టిక్ టాక్ మాయలో పడి ఇలాంటి లింకులను క్లిక్ చేయొద్దంటూ హెచ్చరిస్తున్నారు. కాగా, ప్రస్తుతం టిక్‌టాక్‌ యాప్ గూగుల్ ప్లేస్టోర్, ఆపిల్ స్టోర్‌లలో లేదు. అఫీషియల్‌గా వాట్సాప్ లేదా టిక్‌టాక్ వంటి వాటి నుంచి సందేశం వచ్చినట్లయితేనే డౌన్‌లోడ్‌ చేయండి తప్పితే.. హానికరమైన లింకుల ద్వారా ఎలాంటి నకిలీ అప్లికేషన్లను డౌన్‌లోడ్‌ చేయొద్దని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.