వాటల విక్రయానికి సిద్ధమవుతున్న ‘టిక్‌టాక్’

గిచ్చి కయ్యాల డ్రాగన్ కంట్రీకి చెక్ పెట్టేందుకు ప్రపపంచ దేశాలు ఒక్కటయ్యాయి. ఇందులో భాగంగా ఒకరి తర్వాత ఒకరు ఆ దేశ సంస్థలపై వేటు వేస్తున్నారు. చైనాను కట్టడి చేసేందుకు అన్ని దేశాలూ టిక్‌టాక్‌ను పావుగా వాడుకుంటున్నాయి. దీంతో ఆ కంపెనీ మాతృసంస్థ ‘బైట్‌డాన్స్’కు ఏం చేయాలో తెలియడం లేదు. దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. భారత్‌ తరహాలోనే మరిన్ని దేశాలు టిక్‌టాక్‌ను నిషేధించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మెజారిటీ వాటాను విక్రయించేందుకు ఆ కంపెనీ సన్నద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. […]

వాటల విక్రయానికి సిద్ధమవుతున్న 'టిక్‌టాక్'
Follow us

|

Updated on: Jul 25, 2020 | 7:54 AM

గిచ్చి కయ్యాల డ్రాగన్ కంట్రీకి చెక్ పెట్టేందుకు ప్రపపంచ దేశాలు ఒక్కటయ్యాయి. ఇందులో భాగంగా ఒకరి తర్వాత ఒకరు ఆ దేశ సంస్థలపై వేటు వేస్తున్నారు. చైనాను కట్టడి చేసేందుకు అన్ని దేశాలూ టిక్‌టాక్‌ను పావుగా వాడుకుంటున్నాయి. దీంతో ఆ కంపెనీ మాతృసంస్థ ‘బైట్‌డాన్స్’కు ఏం చేయాలో తెలియడం లేదు. దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. భారత్‌ తరహాలోనే మరిన్ని దేశాలు టిక్‌టాక్‌ను నిషేధించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మెజారిటీ వాటాను విక్రయించేందుకు ఆ కంపెనీ సన్నద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం ‘బైట్‌డాన్స్’ మార్కెట్ విలువ 100 బిలియన్‌ డాలర్లకు పైగానే ఉంటుంది. కేకేఆర్‌, టైగర్‌ గ్లోబల్‌, సాఫ్ట్‌బ్యాంక్‌, సెక్వోయియా, జనరల్‌ అట్లాంటిక్‌ వంటి అంతర్జాతీయ సంస్థలు ఇందులో భారీగా పెట్టుబడులు పెట్టాయి. దేశ పౌరుల వ్యక్తిగత సమాచారం, గోప్యత, సార్వభౌమత్వానికి భంగం కలుగుతుందని టిక్‌టాక్‌, హెలో యాప్‌లను భారత్‌ నిషేధించిన సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు ఈ యాప్‌లను నిషేధించాలని కోరుతూ అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యులు కొందరు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు లేఖ రాశారు. వారి లేఖను పరిగణనలోకి తీసుకుంటున్నామని, నిషేధం గురించి ఆలోచిస్తున్నామని సెక్రెటరీ ఆఫ్‌స్టేట్‌ మైక్‌ పాంపియో సైతం అన్నారు. దీంతో మరింత టిక్ టాక్ మాత‌ృ సంస్థ ‘బైట్‌డాన్స్’ ఒత్తిడికి లోనవుతోంది.