బెడ్ పై టైగర్..అస్సాంలో రేర్ సీన్ !

భారీ వర్షాలు, వరదలతో సతమతమవుతున్న అస్సాంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు, గ్రామాలు రాజధానితో సంబంధాలను కోల్పోగా వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. బ్రహ్మపుత్ర నదితో సహా ఇతర నదులు పరవళ్లు తొక్కుతూ లోతట్టు ప్రాంతాలను ముంచేస్తున్నాయి. ఇంత బీభత్సంలోనూ ఓ వింత జరిగింది. కజిరంగ లోని నేషనల్ పార్కు నుంచి చిన్నా, చితకా జంతువులతో బాటు క్రూర మృగాలు కూడా మరణించడమో, నీటిలో కొట్టుకుపోవడమో చూసి వైల్డ్ లైఫ్ పార్క్ అధికారులు చలించిపోయారు. ఓ రాయల్ బెంగాల్ టైగర్ వరదల్లో చిక్కుకుని ఎటూ పోలేక.. ఓ ఇంట్లో ప్రవేశించింది. నీటి కారణంగా దాదాపు కూలిపోయే స్థితిలో ఉన్న ఆ ఇంట్లోని గదిలో..బెడ్ పైకి చేరింది. ఇంటి యజమాని అది చూసి భయంతో అధికారులకు సమాచారం అందించగా.. వారు అక్కడికి చేరుకొని ఆ పులిని ట్రాంక్విలైజర్ తో స్పృహ కోల్పోయేలా చేశారు. ఆకలితో నకనకలాడుతూ ఆ బెడ్ పై అచేతనంగా చేరిన దాన్ని ఆ తరువాత రెస్క్యూ చేశారు. ఈ పులి గారి ‘ బెడ్ సీన్ ‘ ఫోటోను వైల్డ్ లైఫ్ పార్క్ సిబ్బంది ట్విటర్ లో షేర్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *