#Lock-down impact మారటోరియం వాడుకుంటున్నారా? జరజాగ్రత్త.. వడ్డీ పేలిపోద్ది!

కేంద్రం ప్రకటించినట్లు లాక్ డౌన్ పీరియడ్‌లో క్రెడిట్ కార్డులు పర్సనల్ లోన్ పేమెంట్స్ చెల్లించకుండా వుందామనుకుంటున్నారా? ఇంకోసారి ఆలోచించి మరీ నిర్ణయం తీసుకోంది. ఎందుకంటే..

#Lock-down impact మారటోరియం వాడుకుంటున్నారా? జరజాగ్రత్త.. వడ్డీ పేలిపోద్ది!
Follow us

|

Updated on: Mar 31, 2020 | 1:07 PM

Moratorium may cost more for credit card & personal loan holders: కేంద్రం ప్రకటించినట్లు లాక్ డౌన్ పీరియడ్‌లో క్రెడిట్ కార్డులు పర్సనల్ లోన్ పేమెంట్స్ చెల్లించకుండా వుందామనుకుంటున్నారా? ఇంకోసారి ఆలోచించి మరీ నిర్ణయం తీసుకోంది. ఎందుకంటే క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్ సహా ఇతరాలను చెల్లించకున్నా మీకు వేధింపులు వుండవు అని కేంద్రం చెప్పింది కానీ.. ఈఎంఐలు, క్రెడిట్ కార్డుల బిల్లులు చెల్లించ లేకపోయిన వారికి వడ్డీ మినహాయింపులు ఇవ్వాలని మాత్రం కేంద్రం ఆయా బ్యాంకులకు, ఫైనాన్స్ సంస్థలను ఆదేశించలేదు. సో.. ఈఎంఐలు, క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించకుండా వుంటే మూడు నెలల తర్వాత పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

క్రెడిట్ కార్డులపై బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు వందకు నెలకు మూడున్నర నుంచి నాలుగు రూపాయల దాకా వడ్డీ వసూలు చేస్తాయి. ఆ లెక్కన మూడు నెలల మారటోరియం గనుక వాడుకుంటే దాదాపు మూడురెట్ల వడ్డీ చెల్లించాల్సి వుంటుంది. అదే సమయంలో పర్సనల్ లోన్స్‌పై 10 నుంచి 18 శాతం దాకా వడ్డీని వసూలు చేస్తాయి బ్యాంకు, ఫైనాన్స్ సంస్థలు. మూడు నెలల మారటోరియం వాడుకుంటే మూడు నెలల వడ్డీ, దానికి అదనపు పైన్ కలిపి చాలా ఎక్కువ స్థాయిలో సొమ్ము చెల్లించాల్సిన పరిస్థితి తలెత్తే ప్రమాదం వుంది.

మారటోరియం ప్రకటించిన కేంద్రం నాలుగైదు రోజులు అయినా.. బ్యాంకులకు, ఫైనాన్స్ సంస్థలకు నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేయలేదు. ఈ దరిమిలా.. అపరాధ రుసుము, లేట్ పేమెంట్ ఛార్జీల సంగతి ఏంటి అన్న అంశాలపై క్లారిటీ లేదు. ఈ లెక్కన క్రెడిట్ కార్డుల బిల్లులు, పర్సనల్ లోన్స్ ఈఎంఐలను చెల్లించకపోతే ఇబ్బందుల పాలవక తప్పదు. ఓ ఫైనాన్షియర్ అంఛనా ప్రకారం మూడు నెలల పాటు క్రెడిట్ కార్డు బిల్లు కట్టకపోతే… ఓ అంఛనా ప్రకారం లక్ష రూపాయల అవుట్ స్టాండ్ డ్యూ వున్న క్రెడిట్ కార్డు హోల్డర్ మూడు నెలల తర్వాత అంటే జూన్ నెలల దాదాపు 15 వేల రూపాయలు అదనంగా చెల్లించాల్సి వుంటుందని తెలుస్తోంది. ఈ మొత్తం బ్యాంకులు, పైనాన్స్ సంస్థలు ఛార్జీ చేసే వడ్డీ రేటు ఆధారంగా కాస్త అటూ ఇటూగా వుండొచ్చు.

కానీ, మూడు నెలల మారటోరియం తర్వాత చెల్లించే మొత్తం మాత్రం వాచిపోయే ప్రమాదమే ఎక్కువ. ఈలోగా కేంద్రం మరింత క్లారిటీతో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలకు నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేస్తే తప్ప ప్రజలకు పెద్దగా ఉపయోగం లేదు. బిల్లులు, ఈఎంఐలు కట్టకపోతే.. బెదిరింపులు, ఫాలో అప్‌లు వుండకపోవచ్చు గానీ వడ్డీ భారం మాత్రం తప్పదు. అదనపు ఛార్జీలు మాత్రం తప్పవు. ఈ క్రమంలో ఏదో ఒకలా బిల్లులు, ఈఎంఐలు చెల్లించడమే బెటర్ అని ఆర్థిక నిఫుణులు సలహా ఇస్తున్నారు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో