వికటించిన వాట్సప్ వైద్యం.. చిన్నారి మృతి

వైద్యుడి నిర్లక్ష్యం.. ఓ మూడు నెలల చిన్నారి ప్రాణాలను బలిగొన్నది. వాట్సప్ వీడియో కాలింగ్ ద్వారా.. సిబ్బందితో వైద్యం చేయించడంతో.. ఆ బాలుడి ప్రాణాలు గాల్లో కలిశాయి. వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ బాలుని తల్లిదండ్రులు, బంధువులు ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు. దీంతో పట్టణంలో ఉద్రిక్తత నెలకొన్నది. వర్ధన్నపేట పట్టణానికి చెందిన తాళ్లపెళ్లి సంధ్య, సతీష్ దంపతుల శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న తమ మూడు నెలల బాలుడిని స్థానిక ఆధ్య పిల్లల […]

వికటించిన వాట్సప్ వైద్యం.. చిన్నారి మృతి
Follow us

| Edited By:

Updated on: Jul 25, 2019 | 4:20 PM

వైద్యుడి నిర్లక్ష్యం.. ఓ మూడు నెలల చిన్నారి ప్రాణాలను బలిగొన్నది. వాట్సప్ వీడియో కాలింగ్ ద్వారా.. సిబ్బందితో వైద్యం చేయించడంతో.. ఆ బాలుడి ప్రాణాలు గాల్లో కలిశాయి. వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ బాలుని తల్లిదండ్రులు, బంధువులు ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు. దీంతో పట్టణంలో ఉద్రిక్తత నెలకొన్నది.

వర్ధన్నపేట పట్టణానికి చెందిన తాళ్లపెళ్లి సంధ్య, సతీష్ దంపతుల శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న తమ మూడు నెలల బాలుడిని స్థానిక ఆధ్య పిల్లల ఆసుపత్రికి తీసుకెళ్లారు. చిన్నారిని పరీక్షించిన వైద్యుడు డా. వేణుగోపాల్.. చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకున్నాడు. అయితే బాబుకు చికిత్స జరుగుతుండగానే అతడు హన్మకొండలోని తన నివాసానికి వెళ్లిపోయాడు. అదే సమయంలో బాలుడి ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఈ విషయాన్ని ఆసుపత్రి సిబ్బంది.. వాట్సప్‌లో డాక్టర్‌కు వీడియో మెసేజ్ పంపారు. హన్మకొండ నుంచే వాట్సప్ వీడియో కాలింగ్ ద్వారా సిబ్బందికి వైద్య సూచనలు చేశాడు ఆ డాక్టర్. అనంతరం ఆస్పత్రికి వచ్చి.. బాలుడికి మెపిలైజర్ చికిత్స మొదలుపెట్టాడు. అయితే అప్పటికే ఆరోగ్యం క్షీణించడంతో బాలుడి మృతి చెందాడు. దీంతో ఆగ్రహం చెందిన బంధువులు ఆసుపత్రిపై దాడికి యత్నించారు. డాక్టర్ నిర్లక్ష్యంతోనే తమ బాలుడు చనిపోయాడంటూ ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఎలాంటి అనుమతులు లేకుండానే ఆసుపత్రిని నడుపుతున్నట్లు తెలుస్తోంది.