బాలయ్య సినిమా ఇంతకీ ఉన్నట్టా.. లేనట్టా.!

నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు కె.ఎస్ రవికుమార్ ఓ కమర్షియల్ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే అది కాస్తా పట్టాలెక్కలేదు. దీంతో బాలకృష్ణ దర్శకుడు బోయపాటి శ్రీను చిత్రంపై ఫోకస్ చేశాడు. అటు బోయపాటి శ్రీను కూడా బాలకృష్ణ ఇచ్చిన సూచనల మేరకు స్క్రిప్ట్ కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అయితే వీరిద్దరి కలయికలో సినిమా ఎప్పుడు ఉంటుందో క్లారిటీ ఇప్పట్లో వచ్చేలా కనిపించడం లేదని వార్తలు వస్తున్నాయి. హై బడ్జెట్ కారణంగా పోస్ట్‌పోన్ అయిన ఈ సినిమాకి ఇప్పుడు బడ్జెట్ కుదించినా ఎప్పుడు మొదలవుతుందో తెలియని పరిస్థితి.

మరోవైపు బోయపాటి లేటెస్ట్‌గా మార్చిన స్క్రిప్ట్ బాలయ్యకు బాగా నచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రల్లో కనిపిస్తారని.. అందులో ఒక పాత్ర కొంత వైవిధ్యంగా ఉంటుందని సమాచారం. మరి సినిమా ఎప్పుడు మొదలవుతుందో.. వీరిద్దరి కాంబినేషన్‌లో హ్యాట్రిక్ హిట్ వస్తుందా అనేది వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *