ప్లాప్స్ ‘రాజా’ శివ.. విజయ్ ఫ్యాన్స్ ట్రోల్!

Thalapathy Vijay Fans, ప్లాప్స్ ‘రాజా’ శివ.. విజయ్ ఫ్యాన్స్ ట్రోల్!

తమిళ హీరో శివ కార్తికేయన్ వరుసగా రెండు ప్లాప్స్ చవి చూశాడు. గతేడాది రిలీజైన ‘సీమ రాజా’ ప్రేక్షకులను నిరాశపరచగా… రీసెంట్‌గా వచ్చిన ‘మిస్టర్ లోకల్’ సినిమా కూడా ఆకట్టుకోలేకపోయింది. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా తన సొంత టాలెంట్‌తో స్టార్ హీరోగా ఎదిగిన శివ కార్తికేయన్ మొదట్లో వరుస విజయాలు దక్కించుకున్నాడు. ఇక ప్రస్తుతం వరుస ప్లాప్స్ పడటంతో అతడి కెరీర్ ప్రశ్నార్థకంలో పడ్డట్లయ్యింది.

ఇది ఇలా ఉండగా గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో తనకు ఇష్టమైన నటుడు దళపతి విజయ్‌పై నెగటివ్ కామెంట్స్ చేశాడు శివ కార్తికేయన్. దీనితో అవకాశం కోసం ఎదురు చూస్తున్న విజయ్ ఫ్యాన్స్ తమ విశ్వరూపం చూపించడానికి సిద్ధం అయ్యారు. ఇప్పటికే సోషల్ మీడియా సాక్షిగా శివ కార్తికేయన్‌పై పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్న విజయ్ ఫ్యాన్స్ తాజాగా రెండు సినిమాలు ప్లాప్ అవ్వడంతో అతడిని మరింత టార్గెట్ చేశారు. ఇక ప్రస్తుత పరిస్థితిని బట్టి శివ కార్తికేయన్ పెద్ద హిట్ కొడితేనే తప్ప కెరీర్ తిరిగి గాడిలో పడదని సినీ విశ్లేషకులు అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *