Breaking News
  • భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 24,248 కేసులు, 425 మంది మృతి. దేశవ్యాప్తంగా 6,97,413 కేసులు,19,693 మంది మృతి. దేశ వ్యాప్తంగా 2,53,287 యాక్టీవ్ కేసులు,4,24,433 మంది డిశ్చార్జ్. దేశంలో 60.77 శాతానికి చేరిన కరోనా రికవరీ రేటు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • హైదరాబాద్‌లో లాలాపేట పరిధిలో సాధారణ ఇంటికి రూ.25 లక్షల కరెంట్ బిల్లు. మార్చి 6 నుంచి జులై 6 వరకు బిల్లు తీశారు. ఈ నాలుగు నెలల్లో 34,5007 యూనిట్లు విద్యుత్ వాడినట్లు చూపించి.. ఏకంగా రూ. 25,11,467 బిల్లు వేశారు.
  • అమరావతి: మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టు లో పిటిషన్. పిటిషన్ దాఖలు చేసిన అచ్చెన్నాయుడు తరపు న్యాయవాదులు. ఈఎస్ఐ స్కామ్ లో అరెస్టు అయిన అచ్చెన్నాయుడు . ప్రస్తుతం విజయవాడలో జైల్లో ఉన్న అచ్చెన్నాయుడు. వెంటనే బెయిల్ ఇవ్వాలని పిటిషన్ లో కోరిన న్యాయవాది. ఇప్పటికే ఏసీబీ కస్టడీ కూడా ముగిసిందని పిటిషన్ లో పేర్కొన్న న్యాయవాది. ఏసీబీ కోర్టు బెయిల్ పిటీషన్ ను సస్పెండ్ చేయడంతో హైకోర్టు ను ఆశ్రయుంచిన అచ్చెన్నాయుడు తరపు న్యాయవాదులు.
  • హైదరాబాద్ కమిషనరేట్ సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2017 సంవత్సరంలో జరిగిన మైనర్ రేప్ కేసులో నిందితుడికి 10 సంవత్సరాల జైల్ శిక్ష విధించిన కోర్టు.
  • కృష్ణజిల్లా: మచిలీపట్నం సబ్ జైలు నుంచి కొల్లు రవీంద్రను రాజమండ్రి తరలింపు. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించేందుకు న్యాయమూర్తి అనుమతి. గత రెండురోజులుగా మచిలీపట్నం సబ్ జైల్లో ఉన్న కొల్లు రవీంద్ర. వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య కేసులో అరెస్ట్ అయిన మాజీమంత్రి కొల్లు. అరెస్ట్ ను ఖండిస్తూ టీడీపీ నేతలు నిరసన. సబ్ జైలుకు చేరుకుని నల్ల బ్యార్జ్ లతో నిరసన. భారీ బందోబస్తు తో కొల్లు రవీంద్ర ను తరలించిన పోలీసులు.
  • కృష్ణాజిల్లా: మచిలీపట్నంలో కేటుగాడు అరెస్ట్. నకిలీ ఈపాస్ లు సృష్టించిన కేసులో అరెస్ట్. నిందితుడు ప్రకాశం జిల్లాకు చెందిన పవన్ కుమార్ గా గుర్తింపు. 73 మందికి ఫోర్జరీ చేసిన ఈపాస్ లు ఇచ్చినట్టు నిర్దారణ. హైదరాబాద్ లోని ఓ కన్సల్టెన్సీ కంపెనీలో పని చేస్తున్న పవన్.
  • దేశ రాజధాని ఢిల్లీలో లక్ష దాటిన కరోనా కేసులు. 1,00,823కి చేరుకున్న మొత్తం ఢిల్లీ కేసుల సంఖ్య. గత 24 గంటల్లో 1,379 కొత్త కేసులు నమోదు. ఇందులో 72,088 మంది కోలుకుని డిశ్చార్జవగా, 25,620 యాక్టివ్ కేసులు. ఢిల్లీలో మొత్తం కోవిడ్-19 మరణాల సంఖ్య 3,115.

బ్రేకింగ్‌.. పాల్‌ఘర్‌లో మరో దారుణం.. ఇద్దరు సాధువులపై దాడి చేసి.. ఆ తర్వాత..

Temple looted.. sadhus attacked in Maharashtra's Palghar.. one accused held, బ్రేకింగ్‌.. పాల్‌ఘర్‌లో మరో దారుణం.. ఇద్దరు సాధువులపై దాడి చేసి.. ఆ తర్వాత..

మహారాష్ట్రలో మరో దారుణం చోటుచేసుకుంది. పాల్‌ఘర్‌లో సాధువులపై మూకదాడి చేసి ఇద్దర్ని చంపేసిన ఘటన మరవకముందే.. మళ్లీ ఇదే ప్రాంతంలో మరో సంఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని బలివాలీ సమీపంలోని వాసాయి గ్రామ సమీపంలో ఉన్న జాగృత్ మహాదేవ్‌ మందిర్‌లో గురువారం తెల్లవారుజామున ఇద్దరు సాధువులపై దాడి జరిగింది. ఆలయంలోనికి ముగ్గురు దుండగులు.. ఆయుధాలతో ప్రవేశించి.. అక్కడి ఆలయంలో పూజలు నిర్వహించే దయానంద్‌ సరస్వతి, శ్యామ్‌ సింగ్‌లపై దాడికి దిగారు. అనంతరం.. ఆలయంలో ఉన్న రూ. 6800/- నగదును దోచుకెళ్లారు. అంతేకాదు.. ఆలయంలో ఉన్న పలు విలువైన వస్తువులను కూడా దోచుకెళ్లినట్లు ఆలయ పూజారులు తెలిపారు. ఈ సంఘటన గురువారం తెల్లవారుజామున 12.30 గంటలకు చోటుచేసుకుంది. అయితే ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. దాడికి పాల్పడ్డ ముగ్గురు నిందితుల్లో ఒకర్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అతడి వద్ద నుంచి రెండువేల నగదును స్వాధీనం చేసుకున్నామని.. మిగతా ఇద్దరి దుండగుల కోసం గాలింపు చేపడుతున్నామని తెలిపారు.

కాగా, ఇదే జిల్లాలో గత ఏప్రిల్‌ నెల 16వ తేదీన.. వాహనంలో సూరత్‌ వెళ్తున్న సాధువులపై గ్రామస్థులు మూకదాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు సాధువులతో పాటు.. వాహన డ్రైవర్‌ కూడా మరణించారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 115 మందికి పైగా అరెస్ట్ అయ్యారు. తాజాగా.. ఇదే ప్రాంతంలో సాధువులపై దాడి జరగడం కలకలం రేపుతోంది.

Related Tags