టాలీవుడ్ హంగామా షురూ.. ఆగష్టులో రిలీజ్‌కు 20 చిత్రాలు రెడీ!

కరోనా దెబ్బతో రెండు నెలలుగా స్తంభించిపోయిన చిత్ర పరిశ్రమ నిర్మాణాంతర కార్యక్రమాలతో పున: ప్రారంభమైంది. ఈ నెల సెట్‌లో క్లాప్, యాక్షన్ మాటలు వినిపించడమే తరువాయి. థియేటర్లు ప్రేక్షకులతో, కొత్త పోస్టర్లతో కళకళలాడటానికి మరో రెండు నెలలైన...

టాలీవుడ్ హంగామా షురూ.. ఆగష్టులో రిలీజ్‌కు 20 చిత్రాలు రెడీ!
Follow us

| Edited By:

Updated on: Jun 05, 2020 | 2:58 PM

కరోనా దెబ్బతో రెండు నెలలుగా స్తంభించిపోయిన చిత్ర పరిశ్రమ నిర్మాణాంతర కార్యక్రమాలతో పున: ప్రారంభమైంది. ఈ నెల సెట్‌లో క్లాప్, యాక్షన్ మాటలు వినిపించడమే తరువాయి. థియేటర్లు ప్రేక్షకులతో, కొత్త పోస్టర్లతో కళకళలాడటానికి మరో రెండు నెలలైన వేచి చూడక తప్పని పరిస్థితి ఉంది. సినీ వర్గాలన్నీ విశ్వసిస్తున్న సమాచారం ప్రకారం.. ఆగష్టు నాటికి థియేటర్లు తెరుచుకునే అవకాశముందని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో థియేటర్లు తెరిచే నాటికి 20 నుంచి 30 చిత్రాలైనా ముస్తాబు చేసి పెట్టుకోవడమే లక్ష్యంగా పరిశ్రమ అడుగులేస్తోంది. చివరి దశ చిత్రీకరణలో ఉన్న వాటిల్లో పవన్, వెంకటేష్ చిత్రాలు మినహా మిగిలినవన్ని ఓ వారం రోజుల్లో అయిపోతాయి. ఇక వీటితో పాటు కొత్త దర్శక, నిర్మాతల చేతుల్లో రూపదిద్దుకుంటున్న సినిమాలు 20 వరకైనా ఉంటాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే కొందరు ప్రారంభించిన నేపథ్యంలో.. థియేటర్లు తెరచుకునే నాటికి 20కి పైగా సినిమాలు సిద్ధం చేయడం పెద్ద విషయమేమీ కాదు. అయితే సినిమాల్ని సిద్ధం చేసినా కూడా.. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి సమయం పట్టవచ్చని కొందరు భావిస్తున్నారు. అందులోనూ ప్రస్తుతం కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉన్న చిత్రాలు:

వకీల్ సాబ్, నారప్ప, క్రాక్, సోలో బ్రతుకే సో బెటర్, లవ్‌స్టోరీ, మెస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, శ్రీకారం, అల్లుడు అదుర్స్, మెసగాళ్లు, ఏ1 ఎక్స్‌ప్రెస్, నాంది, బంగారు బుల్లోడు, ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య

విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు:

వి, నిశ్శబ్దం, అరణ్య, రెడ్, ఉప్పెన, ఓరేయ్ బుజ్జిగా, మిస్ ఇండియా, 30 రోజుల్లో ప్రేమించటం ఎలా?

Read More:

ఈ నెల 11 నుంచి దర్శనాలు.. తిరుమల కొండపై కొత్త కండీషన్లు ఇవే..

తెలంగాణ హోం క్వారంటైన్ న్యూ గైడ్‌లైన్స్‌.. ఇంట్లో ఇలా ఉండాలి..

ఇంటర్ బుక్స్‌కి ఇక కొత్త కోడ్.. అదేంటంటే!