Warangal: పెళ్లి చేసుకోవాలంటూ కానిస్టేబుల్ వేధింపులు.. యువతి ఏం చేసిందంటే..?

Constable harasses: ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్‌ వేధింపులకు యువతి బలైంది. పెళ్లి చేసుకోవాలని బలవంతం చేస్తుండటంతో.. వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య (Suicide) చేసుకుంది.

Warangal: పెళ్లి చేసుకోవాలంటూ కానిస్టేబుల్ వేధింపులు.. యువతి ఏం చేసిందంటే..?
Hanamkonda Suicide
Follow us

|

Updated on: Apr 20, 2022 | 12:13 PM

Constable harasses: ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్‌ వేధింపులకు యువతి బలైంది. పెళ్లి చేసుకోవాలని బలవంతం చేస్తుండటంతో.. వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య (Suicide) చేసుకుంది. ఈ ఘటన హన్మకొండ జిల్లాలోని శాయంపేట మండలం తహరాపూర్‌లో చోటుచేసుకుంది. శాయంపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తహరాపూర్‌కి చెందిన దొంగరి సంగీత (30) ములుగు జిల్లా ఏటూరు నాగారంలో ఐసీడీఎస్‌ పర్యవేక్షకురాలిగా పనిచేస్తోంది. ఈ క్రమంలో హన్మకొండ ట్రాఫిక్‌ విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సర్వేష్‌ యాదవ్‌ ఆమెకు కొద్ది నెలల కిందట పరిచయమయ్యాడు. అనంతరం సంగీత నెంబర్ తీసుకోని తనను పెళ్లి చేసుకోవాలంటూ సర్వేష్ యాదవ్ తరచూ ఫోన్‌ చేసి వేధించేవాడు.

కానిస్టేబుల్ వేధింపులు భరించలేకపోయిన సంగీత.. సోమవారం కార్యాలయానికి వెళ్లి ఇంటికొచ్చి పురుగు మందు తాగింది. అనంతరం తాను పురుగు మందు తాగానంటూ తన సోదరికి వివరించింది. అప్రమత్తమైన కుటుంబసభ్యులు వెంటనే ఆమెను పరకాలలోని ఓ ప్రైవేట్‌ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

మృతురాలి తండ్రి వీరయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని.. ట్రాఫిక్ కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Also Read:

Anakapalle: తప్పు ఒప్పుకున్న పుష్ప.. సర్‌ప్రైజ్ అంటూ షాకిచ్చి సెంట్రల్ జైలుకెళ్లింది..

Netflix: నెట్‌ఫ్లిక్స్‌ సంచలన నిర్ణయం.. యూజర్లకు షాక్ ఇచ్చిన ఓటీటీ ప్లాట్ ఫామ్..