సభ్య సమాజం సిగ్గుపడే ఘటన.. అనాథలా తల్లిని బస్టాండ్‌లో వదిలేసిన కూతురు! కాసేపటికే దారుణం..

వయోభారంతో అనారోగ్యం కారణంగా మంచాన పడిన తల్లిని భారంగా భావించింది ఆమె కూతురు. అంతే నిర్ధాక్షిణ్యంగా బస్టాండ్‌లో వదిలేసి చేతులు దులుపుకుంది. దిక్కులేని స్థితిలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆ తల్లి అనాథలా అక్కడే ప్రాణాలు విడిచింది. మానవత్వానికి మచ్చ తెచ్చేలా ఉన్న..

సభ్య సమాజం సిగ్గుపడే ఘటన.. అనాథలా తల్లిని బస్టాండ్‌లో వదిలేసిన కూతురు! కాసేపటికే దారుణం..
Woman Abandoned Her Mother At Bus Stand

Updated on: Jan 16, 2026 | 10:34 AM

ఓ తల్లి పట్ల కన్న కూతురు దారుణంగా వ్యవహరించింది. వయోభారంతో అనారోగ్యం కారణంగా మంచాన పడిన తల్లిని భారంగా భావించింది ఆమె కూతురు. అంతే నిర్ధాక్షిణ్యంగా బస్టాండ్‌లో వదిలేసి చేతులు దులుపుకుంది. దిక్కులేని స్థితిలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆ తల్లి అనాథలా అక్కడే ప్రాణాలు విడిచింది. మానవత్వానికి మచ్చ తెచ్చేలా ఉన్న ఈ దారుణ ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..

జోగులాంబ గద్వాల్ జిల్లా పెద్ద ఆముదాలపాడుకి చెందిన పుణ్యవతి (62), రామిరెడ్డి దంపతులు. వీరికి ఓ కుమార్తె ఉంది. ఆమె పేరు కవిత. పుణ్యవతి దంపతులు కుమార్తెకు వివాహం జరిపించి అత్తరింటికి పంపారు. అయితే రామిరెడ్డి 14 ఏళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో కవిత తన తల్లి పుణ్యవతి, భర్త శ్రీనివాసరెడ్డితో కలిసి మానవపాడుకు వచ్చి నివాసం ఉంటుంది. అక్కడే కవిత భర్త శ్రీనివాసరెడ్డి ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించసాగాడు. అయితే కవిత భర్త శ్రీనివాసరెడ్డి కూడా ఏడేళ్ల క్రితం మరణించాడు.

అప్పటి నుంచి తల్లీ కూతుళ్లు ఇద్దరు అక్కడే ఉంటూ ఎదో ఒక పని చేసుకుంటూ జీవించ సాగారు. ఈ క్రమంలో తల్లి పుణ్యవతి వృద్ధాప్యం కారణంగా అనారోగ్యానికి గురైంది. ఇటీవల చికిత్స నిమిత్తం కవిత తల్లిని కర్నూలులోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లింది. అక్కడ వైద్యులు పరీక్షించి ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని చేతులెత్తేశారు. దీంతో తల్లిని తీసుకుని కవిత ఇంటికి ప్రయాణమైంది. అనారోగ్యంతో ఉన్న తల్లిని భారంగా భావించిన కవిత దారుణ నిర్ణయం తీసుకుంది. బుధవారం రాత్రి కొన ఊపిరితో ఉన్న తల్లిని మానవపాడు ఆర్టీసీ బస్టాండులో వదిలేసి వెళ్లిపోయింది. అయితే దిక్కుతోచని స్థితిలో కాసేపటికే బస్టాండ్‌లోనే తల్లి పుణ్యావతి మరణించింది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బస్టాండ్‌లో కన్నతల్లిని అనాథలా వదిలేసిన కూతురు కవిత సమాచారం తెలుసుకుని ఆమెను పిలిపించారు. అనంతరం కవితను మందలించి మృతదేహాన్ని ఆమెకు అప్పగించి అంత్యక్రియలు జరిపించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.