Snake: మనుషులకు భయపడదు.. రాత్రుళ్లు మాత్రమే వేటాడుతుంది.. ఈ పాము ఏంటో చెప్పగలరా.!

చూడటానికి అత్యంత ప్రమాదకరమైన కట్లపాములా కనిపించే 'వూల్ఫ్ స్నేక్' గురించి మీకు తెలుసా? ఇది విషపూరితమా కాదా? మనుషులకు దీనివల్ల ముప్పు ఉందా అనే ఆసక్తికర విషయాలు ఇక్కడ చదవండి. లేట్ ఎందుకు ఓసారి ఈ స్టోరీ చూసేయండి మరి. ఆ వివరాలు..

Snake: మనుషులకు భయపడదు.. రాత్రుళ్లు మాత్రమే వేటాడుతుంది.. ఈ పాము ఏంటో చెప్పగలరా.!
Snake

Updated on: Apr 28, 2026 | 7:06 AM

పాము అనగానే మనందరికీ వెన్నులో వణుకు పుడుతుంది. ముఖ్యంగా రాత్రిపూట పాములు కనిపిస్తే ఆ భయం రెట్టింపు అవుతుంది. అయితే, మనం చూసే పాములన్నీ విషపూరితమైనవి కావు. ఈ పాము చూడటానికి అచ్చం అత్యంత ప్రమాదకరమైన ‘కట్లపాము'(Common Krait)లాగే ఉంటుంది, కానీ దీనిని ‘వూల్ఫ్ స్నేక్’ (Wolf Snake) అని పిలుస్తారు. లైటింగ్ వేసినా, శబ్దం చేసినా ఇది ఏమాత్రం బెదరదు. సాధారణంగా పాములు కాంతిని చూస్తే పారిపోవడానికి ప్రయత్నిస్తాయి, కానీ ఇది మాత్రం అక్కడే ఉండి పరిస్థితిని గమనిస్తుంది. దీని ధైర్యం చూస్తుంటే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది.

ఇది చదవండి: కరివేపాకు మొక్క పెరగడం లేదా.? ఇవి ఇచ్చారంటే పచ్చగా, వద్దన్నా గుబురుగా పెరుగుతుంది..

ఈ వూల్ఫ్ స్నేక్‌కు ఒక ప్రత్యేకత ఉంది. సాధారణంగా పాములు మనుషులను చూస్తే పారిపోతాయి. కానీ ఈ పాము మాత్రం కెమెరాను చూసినా, మనుషులు దగ్గరకు వచ్చినా అస్సలు భయపడదు. అందుకే దీన్ని ‘మనుషులకు భయపడని పాము’ అని పిలుస్తుంటారు. ఇది రాత్రిపూట మాత్రమే బయటకు వచ్చే ‘నైట్ హంటర్’. దీని శరీరంపై ఉండే తెలుపు లేదా పసుపు రంగు చారలు చూసి చాలామంది దీన్ని విషపూరితమైన కట్లపాము అని పొరబడతారు. కానీ నిజానికి ఇది అస్సలు విషం లేని పాము. దీనికి విష గ్రంధులు ఉండవు, కేవలం పదునైన పళ్ళు మాత్రమే ఉంటాయి. ఇది గోడల మీద, చెట్ల మీద కూడా సులభంగా పాకగలదు. రాత్రిపూట నిద్రపోతున్న బల్లులను, ఎలుకలను ఇది తన ఆహారంగా తీసుకుంటుంది.

దీనివల్ల ఇళ్లలో ఉండే కీటకాల సంఖ్య తగ్గుతుంది. అంటే ఇది రైతులకు, సామాన్య ప్రజలకు ఒక రకంగా మేలు చేసే జీవి. ప్రకృతిలో ప్రతీ ప్రాణికి ఒక ప్రత్యేకమైన పని ఉంటుందని ఈ నైట్ హంటర్ నిరూపిస్తోంది. గ్రామాల్లో, పొలాల వద్ద ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఎలుకలు, బల్లులను వేటాడటంలో ఇవి సిద్ధహస్తులు. ముఖ్యంగా కట్లపాముకు దీనికి మధ్య ఉన్న తేడాలను గుర్తించడం చాలా ముఖ్యం. పొరపాటున విషం లేని పాములను చంపడం వల్ల ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుంది. పాముల పట్ల అనవసరమైన భయాన్ని వదిలి, వాటి గురించి సరైన అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని స్నేక్ క్యాచర్‌లు అంటున్నారు.

ఇది చదవండి: అప్పు ఇస్తున్నారా.? ప్రామిసరీ నోటు మీద ఇది లేకపోతే.. చిత్తు కాగితంతో సమానం..

Follow Us