చేపల దొంగల టవర్ ప్లాన్.. జల్సాల కోసం సినిమా రేంజ్‌లో చోరీలు..సీన్‌ కట్‌చేస్తే..

వరంగల్ పోలీసులు ఛేదించిన ఈ అంతర్ జిల్లా బ్యాటరీ దొంగల ముఠా ఉదంతం సినిమా స్టోరీని తలపిస్తోంది. ఈ ముఠాను అరెస్ట్ చేసిన వరంగల్ పోలీసులు వారి వద్ద 144 బ్యాటరీలు స్వాధీనం చేసుకున్నారు.. చేపల దొంగతనం నుంచి సెల్ టవర్ బ్యాటరీల చోరీ వరకు సాగిన వీరి ప్రస్థానానికి సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించారు. అదంతా చూస్తే ఆశ్చర్యంతో నోరెళ్ల బెట్టాల్సిందే..

చేపల దొంగల టవర్ ప్లాన్.. జల్సాల కోసం సినిమా రేంజ్‌లో చోరీలు..సీన్‌ కట్‌చేస్తే..
Cell Tower Battery Theft

Edited By:

Updated on: Apr 11, 2026 | 12:04 PM

వాళ్లంతా చేపల దొంగలు… చెరువుల్లో చేపల దొంగతనంతో జల్సాలకు సరిపడ ఆదాయం లభించడం లేదని…సెల్ టవర్లను టార్గెట్ చేసి బ్యాటరీల దొంగతనాలకు పాల్పడ్డారు.. అంతర్ జిల్లా ముఠాను అరెస్ట్ చేసిన వరంగల్ పోలీసులు వారి వద్ద 144 బ్యాటరీలు స్వాధీనం చేసుకున్నారు. నగర శివారు ప్రాంతాల్లోని సెల్ టవర్లే వారి టార్గెట్… ఏ మాత్రం అనుమానం రాకుండా బ్యాటరీలు దొంగతనం చేసి సొమ్ము చేసుకుంటున్నారు.. బ్యాటరీల చోరీలకు పాల్పడుతున్న ముఠాలోని ఐదుగురిని వరంగల్ పోలీసులు అరెస్టు చేయగా, మరో ఇద్దరు నిందితులు ప్రస్తుతం పరారీలో వున్నారు. పట్టుబడిన నిందితుల నుండి పోలీసులు సుమారు 1లక్ష 98వేల రూపాయల విలువ గల 144 సెల్ టవర్ బ్యాటరీలు, 2లక్షల 60వేల రూపాయల నగదు, రెండు ట్రాలీలు , రెండు ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు అరెస్టు చేసిన నిందితులందరు నల్గొండ జిల్లాకు చెందిన కొంపల్లి గణేష్ (27), బొంగరాల సుధాకర్ (30), తన్నీరు శివాజీ (26), బీమనబోయిన నరసింహ (31), గడగోజు సురేష్ (25)గా గుర్తించారు..

ప్రధాన నిందితుడైన గణేష్ (డ్రైవర్) మిగితా ఇద్దరు నిందితులు సుధాకర్,శివాజీ జనరేటర్ మరమ్మత్తులు, సెల్ టవర్ పనులకు పరిజ్ఞానం కలిగిన వారు.. వీరంతా ముఠాగా ఏర్పడి, సులభంగా డబ్బు సంపాదించాలనే అలోచనతో సెల్ టవర్లపై పరిజ్ఞానం కలిగి వుండటంతో సెల్ టవర్లకు వినియోగించే బ్యాటరీల్లోని కొన్నింటి తప్పించడం ద్వారా సెల్ టవర్ పనతీరులో ఎలాంటి సమస్యలు రావని గుర్తించారు..

ఇవి కూడా చదవండి

దొంగిలించిన సెల్ టవర్ల బ్యాటరీలను మహరాష్ట్రలోని గచ్చిరోలి ప్రాంతంలో విక్రయించి వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవారు.. ఐతే వీళ్ళంతా చేపల దొంగలు.. రాత్రి సమయాల్లో చెరువుల్లో చేపలను చోరీలకు పాల్పడే ఈ ముఠా సభ్యులు చేపలు చోరీలకు పాల్పడే సమయంలోనే బ్యాటరీలు చోరీ చేసేందుకు అనుకూలంగా వున్న సెల్ టవర్లను గుర్తించి సెల్ టవర్ల లోని బ్యాటరీలను చోరీలకు పాల్పడేవారు..

వీడియో ఇక్కడ చూడండి..

చెరువుల్లో చోరీ చేసిన చేపలను నల్గొండ లో తక్కువ ధర విక్రయించేవారు.. ఈ ముఠా పై యాదాద్రి, నల్గొండ, సూర్యపేట జిల్లాల్లోని వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. మొత్తం 13 సెల్ టవర్ బ్యాటరీ చోరీలకు పాల్పడ్డారు..టెక్నాలజీ ఆధారంగా వారిని పట్టుకున్న పోలీసులు రిమాండ్ కు పంపారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us