VBIT Morphing Issue:వీబీఐటీ ఘటనలో గంటకో కొత్త కోణం.. బయటపడుతున్న సైబర్‌ నేరగాడి దారుణాలు.. వాడు చేస్తున్న గలీజ్ పని ఇదే..

|

Jan 06, 2023 | 12:09 PM

వీబీఐటీ ఘటనలో గంటకో కొత్త కోణం వెలుగుచూస్తోంది. అమ్మాయిలను హడలెత్తించిన సైబర్‌ నేరగాడి దారుణాలు మెల్లి మెల్లిగా బయటకొస్తున్నాయి. నెలరోజుల కిందటే కాలేజీకి..

VBIT Morphing Issue:వీబీఐటీ ఘటనలో గంటకో కొత్త కోణం.. బయటపడుతున్న సైబర్‌ నేరగాడి దారుణాలు.. వాడు చేస్తున్న గలీజ్ పని ఇదే..
Vbit Girl Students Morphing
Follow us on

వీబీఐటీ ఘటనలో అమ్మాయిలను వేధింపులకు గురిచేసిన సైబర్‌ నేరగాడి నేరప్రవృత్తి పోలీసులను సైతం అవాక్కయ్యేలా చేస్తోంది. అమ్మాయిల వేధింపుల కోసం ఏకంగా వాట్సాప్‌ గ్రూప్‌నే క్రియేట్‌ చేశాడు ఈ దుర్మార్గుడు. “ఎంటర్‌ ద డ్రాగన్‌” పేరుతో వాట్సాప్‌ గ్రూప్‌ క్రియేట్‌ చేసి, అమ్మాయిలను బ్లాక్‌మెయిల్‌ చేశాడు నేరగాడు. ఇటీవలే ద కింగ్‌ ఈజ్‌ బ్యాక్‌ అంటూ వాట్సాప్‌ గ్రూప్‌లో చేరి….అమ్మాయిలను హడలెత్తించాడు.. పైగా తనని ఎవ్వరూ ఏం చేయలేరంటూ మెసెజ్‌లతో అమ్మాయిలను భయభ్రాంతులకు గురిచేశాడు. తనతో మాట్లాడకపోతే ట్రబుల్స్‌లో పడతారంటూ పోస్టులు పెట్టి బెదిరించాడు.

హైదరాబాద్‌ నగరంలో వీబీఐటీ ఘటనలో గంటకో కొత్త కోణం వెలుగుచూస్తోంది. అమ్మాయిలను హడలెత్తించిన సైబర్‌ నేరగాడి దారుణాలు మెల్లి మెల్లిగా బయటకొస్తున్నాయి. నెలరోజుల కిందటే కాలేజీకి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లోకి నిందితుడు చొరబడ్డాడు. అమ్మాయిల వేధింపులకు ఏకంగా గ్రూపే క్రియేట్‌ చేశాడంటే ఈ నయా సైబర్‌ నేరగాడి కరుడుగట్టిన క్రిమినల్‌ మైండ్‌ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

ఇదిలా ఉంటే కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరిగిందంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా, పట్టించుకోలేదంటూ మండిపడుతున్నారు. మరోవైపు నిన్న జరిగిన గొడవల నేపథ్యంలో కాలేజీకి వారం రోజులు సెలవులు ప్రకటించింది యాజమాన్యం. సెమిస్టర్ ఎగ్జామ్స్ సైతం మధ్యలోనే రద్దు చేసిన మేనేజ్మెంట్…వారం రోజుల వరకు కాలేజీ క్యాంపస్‌లోకి రావద్దంటూ మెసేజ్‌పెట్టింది. కాలేజీకి సెలవులు ప్రకటించడంతో హాస్టల్ ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు విద్యార్థులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం