నాటురకం”దొంగకోళ్లు’ హల్‌చల్‌

నాటుకోడి టేస్టే వేరు. ఆ పేరు వినగానే చాలా మందికి నోట్లో నీళ్లురుతుంటాయి. దానికి ఎంత రేటు పెట్టినా తప్పులేదనుకుంటారు.. గతంలో అయితే, పండుగలొచ్చినా, ఇంటికి చుట్టాలొచ్చినా కోడిని కోసి వండుకుని తినేవారు. నాటుకోడి కూరతో భోజనం అంటే అందరూ కళ్లు లొట్టలేసుకుని మరీ తినేవారు. కానీ, అంతా తారుమరైంది…ఇప్పుడంతా బాయిలర్‌ కోళ్ల కూరనే.. ప్రస్తుత పరిస్థితుల్లో నాటుకోళ్లు కంటికి కూడా కనిపించటంలేదు. కాంక్రీట్‌ జంగిల్లో నాటుకోళ్ల పెంపకం తగ్గిపోయింది. బాయిలర్‌ కోళ్లపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఫారాల […]

  • Anil kumar poka
  • Publish Date - 3:23 pm, Fri, 27 December 19
నాటురకం"దొంగకోళ్లు' హల్‌చల్‌

నాటుకోడి టేస్టే వేరు. ఆ పేరు వినగానే చాలా మందికి నోట్లో నీళ్లురుతుంటాయి. దానికి ఎంత రేటు పెట్టినా తప్పులేదనుకుంటారు.. గతంలో అయితే, పండుగలొచ్చినా, ఇంటికి చుట్టాలొచ్చినా కోడిని కోసి వండుకుని తినేవారు. నాటుకోడి కూరతో భోజనం అంటే అందరూ కళ్లు లొట్టలేసుకుని మరీ తినేవారు. కానీ, అంతా తారుమరైంది…ఇప్పుడంతా బాయిలర్‌ కోళ్ల కూరనే..

ప్రస్తుత పరిస్థితుల్లో నాటుకోళ్లు కంటికి కూడా కనిపించటంలేదు. కాంక్రీట్‌ జంగిల్లో నాటుకోళ్ల పెంపకం తగ్గిపోయింది. బాయిలర్‌ కోళ్లపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఫారాల నుంచి కోళ్లను కొనుగోలు చేసిన చికెన్‌ సెంటర్‌ నిర్వాహకులు కిలోకు ఇంత ధర నిర్ణయించి విక్రయిస్తున్నారు. నాటుకోడి రుచికి, బాయిలర్‌కోడి రుచికి ఎంతో తేడా ఉంటుంది. ఆ రుచి తెలిసినవారు మాత్రమే కనిపెట్టగలుగుతారు..

హైదరాబాద్‌లో నాటుకోడి రూపంలో ఉన్న హైబ్రిడ్‌జాతి కోళ్లను, నాటుకోళ్ల పేరుతో అంటకడుతున్నారు వ్యాపారులు. ఇవి చూడటానికి అచ్చం నాటుకోళ్ల మాదిరిగానే ఉంటాయి. తేడాలను కనిపెట్టటం కష్టం. దీంతో నగరంలో ఈ దొంగకోళ్ల వ్యాపారం జోరుగా సాగుతోంది. నాటుకోళ్ల ముసుగులో హైబ్రిడ్‌జాతి  లైవ్‌కోడిని 350 నుంచి 400 వరకూ అమ్ముతున్నారు. నగరంలో నాటుకోడికి డిమాండ్‌ ఎక్కువ. అందుకే చాలా మంది రేటు ఎక్కువైనా నాటుకోడిని కొనడానికి ఇష్టపడతారు.

అయితే, సిటీలో అమ్మే నాటుకోళ్లు అసలు నాటుకోళ్లు కావంటూ చాలా మంది ఆరోపిస్తున్నారు.. నిజంగా పల్లెటూరులో పెంచిన నాటుకోళ్లు రుచిగా ఉంటాయని, చూడగానే అవి నాటుకోళ్లో కాదో చెప్పగలుగుతామని అంటున్నారని నాటుకోడి మాంసం ప్రియులు వాపోతున్నారు.

ఇదిలా ఉంటే, వ్యాపారుల వెర్షన్‌ మరోలా ఉంది..సిటీ మొత్తానికి  సరిపడినన్ని నాటుకోళ్లను ఉత్పత్తి చేయడం అసాధ్యం కాబట్టి, నాటుకోళ్లతో కొన్ని వేరేజాతులను క్రాసింగ్‌ చేయించి, నాటుకోళ్లలాగా ఉండే రకాలను ఉత్పత్తి చేస్తున్నట్లుగా చెబుతున్నారు. పల్లెల్లో ఉండే నాటుకోడికి సింథటిక్‌ వెరైటీ క్రాస్‌ చేయడం ద్వారా ఇంప్రూవ్డ్‌ చికెన్‌కోడిని ఉత్తత్తి చేస్తున్నారట. అందుకే అవి నాటుకోడిని పోలి ఉంటున్నాయని చెప్పారు.