BJP: ‘మహాలక్ష్మీ లేదు.. మహారాజు లేదు’.. బీజేపీ విజయ సంకల్ప యాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..

నారాయణపేట జిల్లా కృష్ణా నది ఒడ్డు నుంచి బీజేపీ పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరించింది. ఉదయం గం.11.00ల తర్వాత కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కృష్ణా నది వరకు బీజేపీ నాయకులు, శ్రేణులతో కలిసి ర్యాలీగా వెళ్లారు. నది ఒడ్డున కొలువై ఉన్న దత్తాత్రేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కృష్ణా నది తీరంలో ఏర్పాటు చేసిన కృష్ణమ్మ తల్లికి వేద పండితుల సమక్షంలో ప్రత్యేక పూజలు చేసి, ఆశీస్సులు తీసుకున్నారు.

BJP: 'మహాలక్ష్మీ లేదు.. మహారాజు లేదు'.. బీజేపీ విజయ సంకల్ప యాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
Kishan Reddy
Follow us

| Edited By: Srikar T

Updated on: Feb 20, 2024 | 10:37 PM

నారాయణపేట జిల్లా కృష్ణా నది ఒడ్డు నుంచి బీజేపీ పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరించింది. ఉదయం గం.11.00ల తర్వాత కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కృష్ణా నది వరకు బీజేపీ నాయకులు, శ్రేణులతో కలిసి ర్యాలీగా వెళ్లారు. నది ఒడ్డున కొలువై ఉన్న దత్తాత్రేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కృష్ణా నది తీరంలో ఏర్పాటు చేసిన కృష్ణమ్మ తల్లికి వేద పండితుల సమక్షంలో ప్రత్యేక పూజలు చేసి, ఆశీస్సులు తీసుకున్నారు. బీజేపీ విజయ సంకల్ప యాత్రను ప్రారంభిస్తూ కిషన్​రెడ్డి ఎన్నికల సమరశంఖం పూరించారు. యాత్ర మక్తల్‏కు చేరుకున్న తర్వాత అక్కడి సభలో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలతో కలిసి కిషన్ రెడ్డి ప్రసంగించారు.

ఇవి మోదీ ఎన్నికలు కావు.. దేశ ప్రజల ఎన్నికలు:

వచ్చే పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణకు సంబంధించినవి కావు.. దేశానికి సంబంధించిన ఎన్నికలన్నారు కిషన్ రెడ్డి. ప్రజలంతా నరేంద్రమోదీని ఆశీర్వదించాలని కోరారు. మన పిల్లల కోసం, దేశం కోసం, దేశ భవిష్యత్తు కోసం మోదీని ఎన్నుకోవాలని సూచించారు. 2013లో తెలంగాణ సాధన కోసం ఇక్కడ నుంచే ప్రారంభించిన పోరు యాత్ర తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించింది. అప్పుడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ సాధించుకున్నామని తెలిపారు. తెలంగాణలో కూడా మార్పు రావడమే లక్ష్యంగా విజయ సంకల్ప యాత్ర చేస్తున్నామన్నారు. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని కావాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటున్నారని తెలిపారు. తొమ్మిదేళ్లు కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంటే.. ఇప్పుడు రాహుల్ గాంధీ తెలంగాణను దోచుకొని వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఖర్చు పెట్డడానికి వాడుతున్నారని ఆరోపించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీకి ట్యాక్స్ కడుతుందని విమర్శించారు. దేశ వ్యాప్తంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం పేదలకు 4 కోట్ల ఇండ్లు కట్టించిందని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వలేదని కిషన్ రెడ్డి విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ అంటే అవినీతి, కుంభకోణాలే ఉంటాయని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​ రెడ్డి విమర్శించారు. గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా నరేంద్ర మోదీ దేశంలో అవినీతి రహిత పాలన అందిస్తున్నారని తెలిపారు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో మోదీ ప్రభుత్వం అణచివేసిందన్నారు. పేద ప్రజల కష్టాల తీర్చడానికి నరేంద్ర మోదీ పని చేస్తున్నారని చెప్పారు. దేశంలో కరెంటు కోతలు, ఎరువుల కోరతలు లేవని కిషన్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం అనేక అలివి కాని హామీలతో అధికారంలోకి వచ్చిందని కిషన్​ రెడ్డి మండిపడ్డారు. తాను ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి కరెంటు బిల్లులు కట్టొద్దన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు అతీగతీ లేదని విమర్శించారు. తాను రాగానే రైతులకు రుణమాఫీ, ఎకరానికి రూ.15,000, మహిళలకు రూ.2500 ఇస్తా అని చెప్పారు. మహాలక్ష్మీ లేదు.. మహారాజు లేదు.. వాళ్లు మాత్రం కుర్చీలో కూర్చున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కుటుంబ, అవినీతి, ప్రజలను మోసం చేసే పార్టీలని ఆరోపించారు.

ఇవి కూడా చదవండి

ముఖ్య అతిథిగా హాజరైన కేంద్రమంత్రి:

మక్తల్‎లో ముఖ్యఅతిథిగా హాజరైన కేంద్రమంత్రి పురుషోత్తం రూపాల ప్రసంగించారు. 500 ఏళ్లనుంచి అయోధ్యలో రామ మందిర పోరాటం జరుగుతోందని.. కేవలం ప్రధాని మోదీతోనే రామ మందిరం నిర్మాణం జరిగిందని తెలిపారు. ప్రతిపక్ష పార్టీల నేతలు అయోధ్య రామ మందిరం విగ్రహ ప్రాణ ప్రతిష్టకు రాలేదు.. దర్శనం చేసుకోలేదని విమర్శించారు. కొడుకు కోసం, కుటుంబం కోసం ఆ పార్టీ పోరాడుతుంటే.. మీకోసం, మీ కుటుంబం కోసం మోదీ పోరాడుతున్నారన్నారు పురుషోత్తం రూపాల.

విజయ సంకల్ప యాత్రలో రైతులతో ముఖాముఖి:

బీజేపీ విజయ సంకల్ప యాత్రలో భాగంగా నారాయణ పేట జిల్లా ఉట్కూరులో రైతులతో కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొని తమ సమస్యలను మంత్రి దృష్టికి తెచ్చారు. ముఖ్యంగా జింకల సమస్యను పరిష్కరించాలని కోరారు. జింకలను ఇక్కడి నుంచి తరలించడం కానీ లేదా దగ్గరలోని సంరక్షణ కేంద్రం ఏర్పాటుకు ప్రయత్నిస్తామన్నారు. దీంతో పాటుగా వ్యవసాయ రంగానికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని రైతులకు వివరించారు.

నారాయణపేట జిల్లా కేంద్రంలో ముగింపు:

మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణ నుంచి ప్రారంభమైన తొలిరోజు యాత్ర.. రాత్రికి నారాయణపేట జిల్లా కేంద్రానికి చేరుకుంది. బీజేపీ కార్యకర్తలు యాత్రకు భారీ ఎత్తున స్వాగతం పలికారు. అనంతరం ప్రచార వాహనం నుంచే ప్రజలు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. తొలిరోజు యాత్రలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యులు జితేందర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి, కోశాధికారి శాంతి కుమార్, ఇతర ముఖ్య నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. తొలి రోజు యాత్ర ముగియడంతో కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నారాయణపేట జిల్లాలోనే బస చేశారు. రెండో రోజు మక్తల్, దేవరకద్ర మీదుగా మహబూబ్ నగర్‎కు చేరుకోనుంది. ఉదయం నారాయణపేట పట్టణం శాసన్‎పల్లి రోడ్, లక్ష్మీ ఫంక్షన్ హల్‎లో విలేకరుల సమావేశం అనంతరం యాత్ర ప్రారంభం కానుంది. ​రెండో రోజు యాత్రలో భాగంగా మహిళలు, నేత కార్మికులు, కురుమ సంఘం నేతలతో భేటీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కానున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!