Viral Video: ఓ యువతి చేసిన ట్వీట్ పోలీసులను ఇరకాటంలో పెట్టేసింది.. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..

Viral Video: ఓ యువతి చేసిన ట్వీట్ పుదుచ్చేరి పోలీసులను ఇరకాటంలో పెట్టింది. మీరు వేసుకున్న డ్రస్స్ తీరు కరెక్ట్ కాదంటూ హైదరాబాద్ కు చెందిన ఇద్దరు యువతులను..

Viral Video: ఓ యువతి చేసిన ట్వీట్ పోలీసులను ఇరకాటంలో పెట్టేసింది.. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..
Police

Updated on: Feb 27, 2022 | 9:59 PM

Viral Video: ఓ యువతి చేసిన ట్వీట్ పుదుచ్చేరి పోలీసులను ఇరకాటంలో పెట్టింది. మీరు వేసుకున్న డ్రస్స్ తీరు కరెక్ట్ కాదంటూ హైదరాబాద్ కు చెందిన ఇద్దరు యువతులను అడ్డుకున్నారు పుదుచ్చేరి పోలీసులు. డ్రస్స్‌‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది హైదరాబాద్ కాదు.. పుదిచ్చేరి అంటూ యువతులకు క్లాస్ పీకారు పోలీసులు. ఇక్కడ ఇలాంటి డ్రెస్సులు వేసుకోవద్దు.. వెళ్లి హైదరాబాద్‌లో వేసుకోండంటూ ఉచిత సలహాలు కూడా ఇచ్చారు. దాంతో పోలీసుల తీరుపై హైదరాబాద్ యువతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో పుదుచ్చేరి పోలీసుల నుంచి నేర్చుకున్నానంటూ సదరు యువతి వీడియోను ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ కాస్తా వైరల్ అవడంతో పుదుచ్చేరి పోలీసులు వివాదంలో చిక్కుకున్నారు. ఈ వ్యవహారాన్ని పుదుచ్చేరి ప్రభుత్వం తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది. హైదాబాద్‌కు చెందిన యువతులు పుదుచ్చేరి టూర్‌కు వెళ్లారు. అక్కడి పర్యాటక ప్రాంతాలను చూస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Also read:

Viral Video: దొంగను రక్షించాడు.. చివరికి ఆ దొంగకే బలయ్యాడు.. వీడియో చూస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి..!

Anushka Turns Painter: అనుష్క శర్మలో మరో యాంగిల్ కూడా ఉందండోయ్.. ఈ పోస్ట్ చూస్తే మీరే ఆశ్చర్యపోతారు..!

Telangana: అది నా అడ్డా అంటున్న ఎమ్మెల్యే.. అంతలేదు అంటున్న మాజీ ఎంపీ.. ఇంతకీ వీరి గొడవేంటో తెలుసా?