
పేదింటి ఆడబిడ్డలకు తులం బంగారం అందించే పథకం అమలు చేయడానికి తెలంగాణ సర్కార్ సిద్దమవుతోంది. తాము అధికారంలోకి వస్తే పెళ్లి చేసుకునే పేద కుటుంబాల్లోకి ఆడబిడ్డలకు తులం బంగారం అందిస్తామంటూ కాంగ్రెస్ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చింది. ఈ హామీని ఇప్పటివరకు నెరవేర్చకపోవడంతో ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో తులం గోల్డ్ స్కీమ్ అమలకు రేవంత్ సర్కార్ సన్నద్ధమవుతోంది. దసరా నుంచి ఈ స్కీమ్ అమల్లోకి తీసురావాలని భావిస్తోంది. దసరా నుంచి ఈ పథకాన్ని అమలు చేయాలని సమాలోచనలు చేస్తోంది. కళ్యాణలక్ష్మి పథకం స్థానంలో దీనిని అమలు చేయనున్నారని చెబుతున్నారు.
ప్రస్తుతం కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా పెళ్లి చేసుకునే ఆడబిడ్డలకు ఆర్ధిక సాయం అందిస్తున్నారు. ఇక నుంచి ఆర్ధిక సాయం కాకుండా తులం గోల్డ్ అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. పుస్తెలు, మట్టెల రూపంలో తులం బంగారం అందించాలని భావిస్తోంది. దసరా నుంచి ఈ కొత్త పథకాన్ని ప్రారంభించే యోచనలో ఉన్నట్లు ప్రభుత్వం అధికార వర్గాలు చెబుతున్నాయి. దసరా పెద్ద పండుగ కావడంతో ఆ రోజున ఈ స్కీమ్ లాంచ్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే దసరా కానుకగా మరికొన్ని కార్యక్రమలను ప్రభుత్వం ప్రారంభించనుందని సమాచారం. కొత్త ఆసరా పింఛన్లను కూడా దసరా నుంచి అందించనుందని తెలుస్తోంది. ఇటీవల అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించగా.. లక్షలాది మంది అప్లై చేసుకున్నారు. దీంతో వారి దరఖాస్తులను పరిశీలిస్తోంది.
త్వరలో సామాజిక పించన్లకు సంబంధించి అర్హుల జాబితా సిద్దం చేయనుండగా.. దసరా నుంచి కొత్త పింఛన్లను అందించనుందని తెలుస్తోంది. అలాగే బతుకమ్మ చీరల పంపిణీ కూడా త్వరలో ప్రారంభం కానుంది. ఈ సారి చీరల డిజైన్ కూడా మార్చారు. త్వరలో బతుకమ్మ వస్తుండటంతో వీటిని పంపిణీకి సిద్దం చేయనున్నారు. అలాగే ఉద్యోగులకు రెండు డీఏలను విడుదల చేసేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దసరా సందర్భంగా వీటిని విడుదల చేయనున్నారు. అలాగే కేసీఆర్ కిట్ తరహాలోనే మరో పథకం కూడా దసరా సందర్భంగా ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీని వల్ల ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీలు పెరుగుతాయని అధికారులు చెబుతున్నారు. ఇలా దసరాకు అనేక పథకాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది.