School Holidays: విద్యార్థులకు పండగే.. 9 రోజుల పాటు పాఠశాలలకు సెలవులు!

స్కూళ్లకు సెలవులు వస్తున్నాయంటే పిల్లలు ఎగిరి గంతెస్తారు. సెలవు రోజుల్లో ఎంజాయ్‌ చేస్తారు. సెలవులు అంటే ఇష్టం లేనివాళ్లు అంటూ ఉండరు. ముఖ్యంగా హాస్టళ్లలో చదువుకునే విద్యార్థులు సెలవులు కోసం ఎదురు చూస్తుంటారు. ఆగస్టు నెలలో విద్యార్థులకు చాలా రోజుల పాటు సెలవులు వస్తున్నాయి. రెండవ శనివారం, స్వాతంత్య్ర దినోత్సవం ఇలా పలు పండగలు, ఆదివారాలు అన్నీ కలిపి మొత్తం ఈ నెనలలో 9 రోజుల పాటు పాఠశాలలు మూసి ఉండనున్నాయి. ఈ నెలలో మొత్తం 31 […]

School Holidays: విద్యార్థులకు పండగే.. 9 రోజుల పాటు పాఠశాలలకు సెలవులు!
School Holidays

Updated on: Aug 02, 2024 | 9:43 AM

స్కూళ్లకు సెలవులు వస్తున్నాయంటే పిల్లలు ఎగిరి గంతెస్తారు. సెలవు రోజుల్లో ఎంజాయ్‌ చేస్తారు. సెలవులు అంటే ఇష్టం లేనివాళ్లు అంటూ ఉండరు. ముఖ్యంగా హాస్టళ్లలో చదువుకునే విద్యార్థులు సెలవులు కోసం ఎదురు చూస్తుంటారు. ఆగస్టు నెలలో విద్యార్థులకు చాలా రోజుల పాటు సెలవులు వస్తున్నాయి. రెండవ శనివారం, స్వాతంత్య్ర దినోత్సవం ఇలా పలు పండగలు, ఆదివారాలు అన్నీ కలిపి మొత్తం ఈ నెనలలో 9 రోజుల పాటు పాఠశాలలు మూసి ఉండనున్నాయి.

ఈ నెలలో మొత్తం 31 రోజులకు గాను 22 రోజులే పని దినాలు ఉన్నాయి. అంటే విద్యార్థులకు 9 రోజుల పాటు సెలవులు ఉండనున్నాయి. అలాగే ఇదే నెలలో వరలక్ష్మి వ్రతం, రాఖీ పూర్ణిమ కారణంగా కూడా సెలవులు వస్తున్నాయి. మరి అగస్టు నెలలో ఏయే రోజుల్లో సెలవులు వస్తున్నాయో చూద్దాం.

  1. ఆగస్టు 4న ఆదివారం
  2. ఆగస్టు 10న రెండవ శనివారం
  3. ఆగస్టు 11న ఆదివారం
  4. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం
  5. ఆగస్టు 16న శుక్రవారం వరలక్ష్మి వ్రతం
  6. ఆగస్టు 18న ఆదివారం
  7. ఆగస్టు 19న రాఖీ పూర్ణిమ/శ్రావణ పూర్ణిమ
  8. ఆగస్టు 25న ఆదివారం
  9. ఆగస్టు 26 సోమవారం నాడు శ్రీకృష్ణ జన్మాష్టమి

వరుస సెలవులు..

ఆగస్టు 15, 16, 18, 19న 4 రోజుల పాటు పాఠశాలలకు సెలవులు రానున్నాయి. మధ్యలో ఒకే ఒక్క రోజు వర్కింగ్ డేగా ఉన్న శనివారం సెలవు ఇస్తే కనుక వరుసగా 5 రోజులు సెలవులు వచ్చే అవకాశం ఉంటుంది.

ఆగస్టు 9 వతేది సెలవు ఉండనుందా?

ఆగస్టు 9వ తేదీన అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆ రోజున సెలవు ప్రకటించాలని ఆదివాసీ నేతలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇప్పుటికే కొన్ని ఆదివాసీ రాష్ట్రాలు ఇప్పటికే ఆగస్టు 9వ తేదీన సెలవు ప్రకటించాయి. ఆ రోజున ఆదివాసీలకు సంబంధించిన సాంస్కృతిక, సంప్రదాయ కార్యక్రమాలు చర్చించుకోవడానికి వారు అవకాశం కల్పిస్తున్నారు. తెలంగాణలోనూ సెలవు ఇవ్వండి అని సీఎంకు విజ్ఞప్తి చేశారు. ఒక వేళ 9వ తేదీన కూడా సెలవు ప్రకటిస్తే మొత్తం ఈనెలలో 10 రోజుల పాటు విద్యార్థులకు పండగే.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us